Site icon NTV Telugu

Hyundai Venue : మరో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టిన హ్యుండాయ్

Hyundai

Hyundai

ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ హ్యుండాయ్‌ మరో కొత్త కారును భాతర విపణిలోకి ప్రవేశపెట్టింది. వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ కారులో ఎన్నో ఫీచర్స్‌ ఉన్నాయి. హ్యుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ గురువారం త‌న కొత్త మోడ‌ల్ కంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ వెన్యూ ఫేస్ లిఫ్ట్ కారును విడుదల చేసింది. స‌బ్‌-4 ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మార్కెట్‌లోకి ఎంట‌రైన వెన్యూ పేస్‌లిఫ్ట్ కారు ధ‌ర రూ.7.53 ల‌క్ష‌ల నుంచి అందుబాటులో ఉంది. మూడు పవ‌ర్‌ట్రైన్ ఆప్ష‌న్ల‌లో ఈ కారు అందుబాటులోకి వ‌స్తున్న‌ది. మారుతి సుజుకి బ్రెటా, టాటా మోటార్స్ నెక్స‌న్‌, కియా సొనెట్ త‌దిత‌ర మోడ‌ల్ కార్ల‌తో హ్యుండాయ్‌ వెన్యూ ఫేస్‌ లిఫ్ట్‌ కారు త‌ల‌ప‌డ‌నున్న‌ది. 1.2 లీట‌ర్ల పెట్రోల్ ట్రిమ్ మోడ‌ల్ కారు ధ‌ర రూ.7.53 ల‌క్ష‌ల నుంచి మొద‌ల‌వుతుంది.

1-లీట‌ర్ పెట్రోల్ ఇంజిన్ సామ‌ర్థ్యం గ‌ల వెన్యూ ఫేస్‌లిఫ్ట్, వెన్యూ డీజిల్ వేరియంట్‌ రూ.9.99 ల‌క్ష‌లకు అందుబాటులోకి రానుంది. హ్యుండాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ ఎండీ కం సీఈవో యున్‌సూ కిమ్ గురువారం వెన్యూ ఫేస్‌లిఫ్ట్‌ను లాంఛ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క‌స్ట‌మ‌ర్ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా దీన్ని అభివృద్ధి చేశామ‌ని, బ్రాండ్ వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ, క‌స్ట‌మ‌ర్ల‌ను ఉద్వేగానికి గురు చేస్తుంద‌ని ఆయన వెల్లడించారు. పాత వెర్షన్ కారులో 11 సెగ్మెంట్స్ ఫీచ‌ర్లు, డిజైన్లు ఇత‌ర మార్పులు 40కి పైగా కొత్త మోడ‌ల్‌లో ఉన్నాయ‌ని యున్‌సూ పేర్కొన్నారు.

ఇంటి లోప‌లి నుంచే వెన్యూ ఫేస్‌లిప్ట్‌ కారుపై కంట్రోల్ క‌లిగి ఉండేలా 60కి పైగా క‌నెక్టెడ్ ఫీచ‌ర్లు జ‌త క‌లిశాయ‌ని హ్యుండాయ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించింది. హోం టు కారు (హెచ్‌2సీ), అలెక్సా, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ వంటి కంట్రోల్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. హోం 2 కారు (హెచ్‌2సీ) వ‌ల్ల కారు స్టేట‌స్ తెలుసుకోవ‌చ్చు. రిమోట్ క్లైమేట్ కంట్రోల్‌, రిమోట్ రోడ్ లాక్‌/ అన్‌లాక్‌, రిమోట్ వెహిక‌ల్ స్టేట‌స్ త‌దిత‌ర ఫీచ‌ర్లు కూడా ఉన్నట్లు యున్‌సూ తెలిపారు.

Exit mobile version