సమ్మర్ సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వనే లేదు అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ తాపానికి కూల్ కూల్ గా డ్రింక్స్ తాగాలనిపిస్తుంటుంది. వాటర్, కూల్ డ్రింక్స్ కూల్ అవ్వడానికి ఫ్రిడ్జ్ లను యూజ్ చేయడం కామన్ అయిపోయింది. పాలు, పండ్లు, వెజిటేబుల్స్ స్టోర్ చేసుకునేందుకు కూడా ఫ్రిడ్జ్ లను యూజ్ చేస్తున్నారు. మరి మీరు కూడా వేసవికి ముందే కొత్త ఫ్రిడ్జ్ కొనాలని భావిస్తున్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో బ్రాండెడ్ ఫ్రిడ్జ్ లపై భారీ తగ్గింపు లభిస్తోంది. బడ్జెట్ ధరలో లభించే ఈ ఫ్రిడ్జ్ లపై ఓ లుక్కేయండి.
Haier 185 L Direct Cool Single Door 2 Star Refrigerator:
ఫ్లిప్ కార్ట్ లో హైయర్ బ్రాండ్ కు చెందిన సింగిల్ డోర్ 2 స్టార్ రిఫ్రిజిరేటర్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 29 శాతం తగ్గింపు ప్రకటించింది. దీని అసలు ధర రూ. 17,090గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 11,990కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫ్రిడ్జ్ 185 లీటర్ల కెపాసిటీతో వస్తుంది. డైమండ్ ఎడ్జ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ, స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్, యాంటీ బాక్టీరియల్ గాస్కెట్, ధృఢమైన గ్లాస్ శెల్వ్స్, లార్జ్ వెజిటేబుల్ బాక్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
Godrej 183 L Direct Cool Single Door 2 Star Refrigerator
గోద్రేజ్ 183 L డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ 2 స్టార్ రిఫ్రిజిరేటర్ పై ఫ్లిప్ కార్ట్ లో 23 శాతం తగ్గింపు లభిస్తోంది. దీని అసలు ధర రూ. 16990గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు రూ. 12990కే సొంతం చేసుకోవచ్చు. జంబో వెజిటబుల్ ట్రే, టఫ్డ్ గ్లాస్ షెల్వ్స్ తో వస్తుంది. టర్బో కూలింగ్ టెక్నాలజీతో వస్తుంది.
Whirlpool 184 L Direct Cool Single Door 2 Star Refrigerator
వర్ల్‌పూల్ 184 L డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ 2 స్టార్ రిఫ్రిజిరేటర్ పై ఫ్లిప్ కార్ట్ లో 22 శాతం తగ్గింపు ప్రకటించింది. దీని అసలు ధర రూ. 15400గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 11990కే దక్కించుకోవచ్చు. ఇన్సులేటెడ్ కాపిల్లరీ టెక్నాలజీ, యాంటీ బాక్టీరియల్ గాస్ కెట్, టఫ్డ్ గ్లాస్ షెల్వ్స్ తో వస్తుంది.