Site icon NTV Telugu

Stock Market Plan: స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావాలంటే ఈ 25 ఏళ్ల యువకుడి ప్లాన్ చూడండి.. పోర్ట్‌ఫోలియోలో రూ.20 లక్షలు..

Capp

Capp

చదువు పూర్తి చేసి ఉద్యోగంలో చేరగానే చాలామంది ఏం చేస్తారు? కొత్త బైక్ కొనడం, ఖరీదైన ఫోన్ తీసుకోవడం లేదా స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకోవడం వంటివి చేస్తారు. కానీ.. ఇక్కడ ఓ 25 ఏళ్ల యువకుడు మాత్రం భిన్నంగా ఆలోచించాడు. కేవలం 3 ఏళ్లలో రూ.20 లక్షల పోర్ట్ పోలియోను నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

అతను తన 22వ ఏట నుంచే పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. ‘వయసు చిన్నదే కదా, తర్వాత చూద్దాం’ అనుకోకుండా.. మొదటి జీతం నుంచే పొదుపు చేయడం అలవాటు చేసుకున్నాడు. మార్కెట్ పెరిగినా, తగ్గినా సంబంధం లేకుండా ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో SIP రూపంలో పెట్టుబడిగా పెట్టాడు. దీనివల్ల అతనికి ‘కాంపౌండింగ్’ (వడ్డీ మీద వడ్డీ) తోడైంది.

తన సంపాదన పెరిగినా, తన జీవనశైలిని మార్చుకోలేదు. విలాసాల కంటే భవిష్యత్తుకే ప్రాధాన్యత ఇచ్చాడు. చేతికి వచ్చిన అదనపు బోనస్‌లను కూడా పెట్టుబడిగా మార్చాడు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు భయపడి తన పెట్టుబడులను వెనక్కి తీసుకోలేదు. మార్కెట్ పడిపోయినప్పుడు మరిన్ని ఎక్కువ షేర్లను తక్కువ ధరకు కొనడానికి ఆ సమయాన్ని వాడుకున్నాడు.

ఈ కథ మనకు నేర్పే పాఠం ఒక్కటే.. ధనవంతులు కావడానికి లక్షల్లో జీతం ఉండాల్సిన అవసరం లేదు. సరైన ప్లానింగ్, చిన్న వయసు నుంచే పెట్టుబడి పెట్టే అలవాటు ఉంటే ఎవరైనా ఆర్థికంగా స్థిరపడవచ్చు. ఈ రోజే మీ పొదుపు ప్రయాణాన్ని ప్రారంభించండి. మరో ముఖ్య విషయం ఏంటంటే.. పెట్టుబడులు పెట్టే ముందు ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మార్కెట్ నష్టభయాలకు లోబడి ఉంటుంది.

Exit mobile version