How Much Cash Can You Legally Keep at Home: ఆదాయపు పన్ను శాఖ అధికారులు వ్యాపారవేత్త లేదా రాజకీయా నాయకుడి ఇంటిపై దాడి చేసి కోట్లాది రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తరచుగా వార్తాపత్రికలలో, టీవీలలో వార్తలు చూస్తుంటాం. ఇవి చూసినప్పుడు సామాన్య ప్రజల మనస్సులలో ఒక ప్రశ్న తలెత్తుతుంది. మన ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవడం చట్టబద్ధమైనది? దీనికి ఏదైనా స్థిర పరిమితి ఉందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఈ ప్రశ్నలకు సమాధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం…
READ MORE: Donald Trump: ట్రంప్‌కు ఏమైంది.. ప్రపంచం నుంచి ఆయన ఏం దాచిపెడుతున్నారు..
వాస్తవానికి.. ఇంట్లో ఎంత మొత్తమైనా నగదు దాచుకోవచ్చు. దానికంటూ ఓ పరిమితి అనేది లేదు. ఇందుకు సంబంధించిన కచ్చితమైన నిబంధనలు కూడా ఏం లేవు. ఇంట్లో ఇంతే డబ్బు దాచుకోవాలని ఆదాయపు పన్ను శాఖ ఎప్పుడూ చెప్పలేదు. కానీ, సోదాలు నిర్వహించినప్పుడు ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు దొరికితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పే ధ్రువీకరణ పత్రాలు మాత్రం తప్పకుండా ఉంచుకోవాలి. అది తమ సక్రమ సంపాదనగా చూపించే ఆధారాలను ఆదాయపు పన్ను శాఖకు చూపించాల్సి ఉంటుంది. ఇలా చూపించలేక పోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
READ MORE: Heroines : లవ్ బ్రేకప్స్ వల్ల బాగుపడ్డ హీరోయిన్స్ ఎవరంటే?
ఉదాహరణకు.. మీరు ఏదైనా వ్యాపారం నిర్వహిస్తూ దాని కోసం ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు నిల్వ చేశారు అనుకుందాం.. దానికి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ ఉండాలి. ప్రతి పైసాకు లెక్క చూపాలి. అలాగే మీ ఆదాయానికి తగినట్లుగా పన్నులు చెల్లిస్తున్నారా, లేదా? అనేది చాలా కీలకంగా మారుంది. ఆదాయపు పన్ను శాఖ ఈ విషయాన్ని వెరిఫై చేస్తుంది. మీరు ట్యాక్స్ కట్టకపోయినా, ఆదాయానికి తగినంత ట్యాక్స్ చెల్లించకపోయినా మీపై ట్యాక్స్ ఎగవేత చట్టం కింద చర్యలు తీసుకుంటారు. అలాగే మీ వద్ద ఉన్న డబ్బులకు సరైన లెక్కలు, డాక్యుమెంట్లు లేకపోతే దానిని ఐటీ శాఖ సీజ్ చేస్తుంది. చాలా మంది వ్యవసాయం ద్వారా సంపాదించిన డబ్బులకు ఎలాంటి ప్రూఫ్స్ అవసరం లేదని భావిస్తుంటారు. కానీ వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయానికి సైతం బిల్లులు ఉండాలి.
