Site icon NTV Telugu

HONOR-BYDల కీలక భాగస్వామ్యం.. కనెక్టివిటీ, AI ఏజెంట్ ఇంటిగ్రేషన్‌లో సరికొత్త ఆవిష్కరణలు.!

Honor Byd

Honor Byd

HONOR-BYD: టెక్నాలజీ దిగ్గజం హానర్, ఆటోమొబైల్ సంస్థ BYD తమ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి. HONOR ప్రొడక్ట్స్ ప్రెసిడెంట్ ఫాంగ్ ఫీ (Fang Fei), BYD సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఆటోమోటివ్ న్యూ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ యాంగ్ డోంగ్‌షెంగ్ (Yang Dongsheng) ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో HONOR CEO జేమ్స్ లీ (James Li), BYD ఛైర్మన్, ప్రెసిడెంట్ వాంగ్ చువాన్‌ఫు (Wang Chuanfu) కూడా పాల్గొన్నారు.

IPL 2026: ఐపీఎల్ వేలానికి ముందే.. పంజాబ్ కింగ్స్‌లో భారీ మార్పు!

ఇకపోతే, ఈ భాగస్వామ్య సహకారం ప్రధానంగా మూడు ముఖ్య రంగాలపై దృష్టి సారిస్తుంది. ఇందులో మొదటగా కోర్ టెక్నాలజీ, ఫీచర్లు ఫోకస్ చేస్తూ.. క్రాస్ డివైస్ ఎకోసిస్టమ్ ఇంటిగ్రేషన్, AI ఏజెంట్ ఇంటిగ్రేషన్, ఖచ్చితత్వ బ్లూటూత్ ఆధారిత కార్ కీ అభివృద్ధి వంటి అంశాలపై ఇరు సంస్థలు కలిసి ఆవిష్కరణలు చేయనున్నాయి. అలాగే ఛానల్ ఎకోసిస్టమ్, వినియోగదారు ప్రయోజనాలపై ద్రుష్టి పెట్టనున్నారు. ఈ విషయమై హానర్ సంబంధించిన కనెక్టెడ్ వెహికల్ సామర్థ్యాలు, BYD ఇంటెలిజెంట్ ఎకోసిస్టమ్‌ను ఉపయోగించుకుని పూర్తి ఇంటర్‌ఆపరేబిలిటీని అందించే సహకార ఛానల్ మోడల్‌ను ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు కమ్యూనికేషన్స్, వినియోగదారు ఎంగేజ్‌మెంట్ పై పలు అంశాలలో పని చేయనున్నాయి. ఇందులో కీలక మైలురాళ్ల చుట్టూ సమన్వయంతో కూడిన మార్కెటింగ్ ప్రయత్నాలు, సంయుక్త ఉత్పత్తి విడుదల, వినియోగదారు ఎంగేజ్మెంట్ కార్యకలాపాలను చేపట్టనున్నారు.

Reel On Track: రీల్స్ కోసం పిచ్చి పని.. రైలు ఢీకొని బాలుడి మృతి..

నిజానికి హానర్, BYD మధ్య సహకారం 2023లోనే ప్రారంభమైంది. అప్పుడు BYD యజమానుల కోసం స్మార్ట్‌ఫోన్ NFC కార్ కీ ఫంక్షనాలిటీని ప్రవేశపెట్టారు. దీని తర్వాత 2024లో వాహనంలో ఫాస్ట్ ఛార్జింగ్ సహకారం కొనసాగింది. 2025లో ఈ భాగస్వామ్యం మరింత బలపడింది. BYD సంబంధిత DENZA బ్రాండ్ HONOR కార్ కనెక్ట్ (HONOR Car Connect) సొల్యూషన్‌ను స్వీకరించిన మొట్టమొదటి బ్రాండ్‌గా నిలిచింది. భవిష్యత్తులో ఈ సొల్యూషన్‌ను ఇతర BYD బ్రాండ్‌లకు విస్తరించాలని యోచిస్తున్నారు. భద్రత, సౌలభ్యానికి ప్రాధాన్యత ఇస్తూ.. ఫోన్-టు-కార్ కనెక్టివిటీ, డిజిటల్ కీలు మరియు ఇతర ఫీచర్ల అభివృద్ధిపై దృష్టి సారించనున్నట్లు ఇరు సంస్థలు ప్రకటించాయి.

Exit mobile version