Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Investment Tips: ప్రభుత్వ ఉద్యోగం అయిన, ప్రైవేట్ ఉద్యోగం అయిన ఉద్యోగులకు బోనస్ వచ్చిందంటే ఆ సంతోషమే వేరు. అయితే చాలా మందికి ఆ బోనస్ డబ్బు చేతికి అందగానే ఒక పెద్ద కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. “ఈ డబ్బుతో హోమ్ లోన్ (ఇంటి రుణం) త్వరగా తీర్చేయాలా? లేక స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ రాబట్టాలా?” అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. పైకి ఇది సాధారణ విషయంగా కనిపించినా.. దీని వెనుక చాలా ఆర్థిక సమీకరణాలు దాగి ఉన్నాయని చెబుతున్నారు ఆర్థిక విశ్లేషకులు. పైన చెప్పిన రెండింటిలో ఏది బెస్ట్ ఛాయిస్ అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కేవలం నంబర్లనే చూడకండి
సాధారణంగా చాలా మంది హోమ్ లోన్ వడ్డీ రేటును, మార్కెట్ ఇచ్చే రిటర్న్స్‌తో పోల్చి చూసి నిర్ణయం తీసుకుంటారు. కానీ అది మాత్రమే సరిపోదని అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. “మనం చెల్లించే హోమ్ లోన్ వడ్డీపై పన్ను మినహాయింపులు పోగా మిగిలే ‘అసలు ఖర్చు’ను, పెట్టుబడులపై పన్నులు పోగా వచ్చే ‘అసలు లాభం’తో పోల్చడమే సరైన పద్ధతి” అని చెబుతున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న కొత్త పన్ను విధానం వల్ల హోమ్ లోన్లపై లభించే పన్ను బెనిఫిట్స్ తగ్గాయి. దీనివల్ల ప్రజలపై లోన్ భారం నిశ్శబ్దంగా పెరిగింది. కాబట్టి పన్నుల తర్వాత మిగిలే లాభ నష్టాలను లెక్కగట్టడం ముఖ్యం అని పేర్కొంటున్నారు.
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
వయసును బట్టి ఫైనాన్షియల్ ప్లాన్ మారుతుందని చెబుతున్నారు. 30 ఏళ్ల యువ ఉద్యోగులకు కెరీర్ పరంగా ఇంకా చాలా సమయం ఉంటుంది. అలాగే వీరికి మార్కెట్ హెచ్చుతగ్గులను తట్టుకునే సామర్థ్యం కూడా ఉంటుంది. కాబట్టి వీరు బోనస్ మొత్తాన్ని ఈక్విటీ (స్టాక్స్/మ్యూచువల్ ఫండ్స్) లలో ఇన్వెస్ట్ చేయడం మంచిదని పలువురు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీరు లోన్ ప్రీ-పేమెంట్‌ను కాస్త వాయిదా వేయవచ్చని చెబుతున్నారు. 50 ఏళ్ల వయసున్న వారు రిటైర్మెంట్కు దగ్గరగా ఉంటారు. కాబట్టి వారి ఆదాయం ఆగిపోయేలోపు అప్పుల్లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు. ఈ క్రమంలో వారికి వచ్చిన బోనస్ మొత్తంతో హోమ్ లోన్ త్వరగా తీర్చేయడమే మంచి నిర్ణయం అని చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా వారికి ఆర్థిక భద్రత, ప్రశాంతత రెండు ఉంటాయని సూచిస్తున్నారు.
లోన్ త్వరగా తీర్చడం ఎప్పుడు బెటర్ అంటే..
ఈ సందర్భంగా పలువురు ఆర్థిక నిపుణులు మాట్లాడుతూ.. కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో లోన్ ముందస్తుగా చెల్లించడం మంచిదన్నారు. హోమ్ లోన్ వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, మీ ఉద్యోగం లేదా ఆదాయం స్థిరంగా లేనప్పుడు, పెట్టుబడులపై వచ్చే రిటర్న్స్ గురించి మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పుడు లోన్ ముందస్తుగా చెల్లించడం చాలా ఉత్తమం అన్నారు. హోమ్ లోన్ తీసుకున్న ప్రారంభ సంవత్సరాల్లో ఈఎంఐ (EMI) లో ఎక్కువ భాగం వడ్డీకే పోతుంది. కాబట్టి లోన్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు ప్రీ-పేమెంట్ చేస్తే భవిష్యత్తులో చాలా వడ్డీ డబ్బు ఆదా అవుతుంది.
ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు వర్కవుట్ అవుతుందంటే..
దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా సంపదను సృష్టించాలనుకునే వారికి ఇన్వెస్ట్మెంట్ మంచి ఆప్షన్‌గా ఉంటుందన్నారు. హోమ్ లోన్ వడ్డీ రేటు కంటే మార్కెట్ ఇచ్చే లాభాలు స్పష్టంగా ఎక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టడం లాభదాయకం అవుతుందన్నారు. అయితే మార్కెట్ పడిపోయినప్పుడు కూడా ఓపికగా పెట్టుబడులను కొనసాగించే క్రమశిక్షణ పెట్టుబడిదారుడికి ఉండాలన్నారు. ఈ రెండింటిలో చాలా మందికి ఒకే మార్గాన్ని ఎంచుకోవడం కష్టంగా అనిపిస్తుంది. అలాంటి వారు రెగ్యులర్‌గా కట్టే ఎస్ఐపీ (SIP) లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపకుండా, చేతికి వచ్చిన బోనస్ లేదా సాలరీ హైక్‌లో కొంత భాగాన్ని హోమ్ లోన్ ముందస్తు చెల్లింపు కోసం ఉపయోగించాలని సూచిస్తున్నారు. దీని వల్ల ఒకవైపు అప్పు తగ్గుతుంది, మరోవైపు సంపద పెరుగుతుందని చెబుతున్నారు.
సింపుల్‌గా చెప్పాలంటే చేతికి బోనస్ వస్తే హోమ్ లోన్ తీర్చాలా, ఇన్వెస్ట్ చేయాలా అనే ప్రశ్నకు అందరికీ సరిపోయే ఒకే ఒక్క సమాధానం లేదు. మీరు మానసిక ప్రశాంతతను, అప్పుల్లేని జీవితాన్ని కోరుకుంటే ముందుగానే లోన్ తీర్చేయండి. అలా కాకుండా, మీకు రిస్క్ తీసుకునే సామర్థ్యం, స్థిరమైన ఆదాయం ఉండి, సంపదను పెంచుకోవాలనుకుంటే ఇన్వెస్ట్ చేయండి. మీ జీవితానికి, మీ కుటుంబ అవసరాలకు ఏది సరిపోతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవడమే ఇక్కడ అత్యంత తెలివైన పని.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!