GST Collections July 2026: దేశ ఆర్థిక వ్యవస్థకు బిగ్ బూస్ట్.. జూలైలో GST వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
- జూలైలో GST వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
- 15.4 శాతం పెరిగి రూ.2.11 లక్షల కోట్లకు
- అక్టోబర్ 1 నుంచి FD నిబంధనల్లో మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST Collections July 2026: దేశంలో వస్తు సేవల పన్ను (GST) వసూళ్లు మరోసారి బలమైన వృద్ధిని నమోదు చేశాయి. 2026 జూలైలో స్థూల GST వసూళ్లు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 15.4 శాతం పెరిగి రూ.2.11 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఆగస్టు 1న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. జూలై నెలలో నమోదైన మొత్తం GST ఆదాయంలో Central GST (CGST): రూ.39,835 కోట్లు, State GST (SGST): రూ.47,881 కోట్లు, Integrated GST (IGST): సుమారు రూ.1.23 లక్షల కోట్లు వంటి వాటా ఉంది. GST వసూళ్లలో కొనసాగుతున్న వృద్ధి దేశ ఆర్థిక కార్యకలాపాల్లో స్థిరమైన ఊపును సూచిస్తోందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
అక్టోబర్ 1 నుంచి FD నిబంధనల్లో మార్పులు
మరోవైపు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిక్స్డ్ డిపాజిట్లకు (FDs) సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఈ మార్పులు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. RBI జారీ చేసిన Reserve Bank of India (Commercial Banks – Interest Rate on Deposits) Second Amendment Directions, 2026 ద్వారా కొత్త నిబంధనలను వెల్లడించింది.
Also Read
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
- Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
- Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
అన్ని బ్రాంచ్‌లలో ఒకే వడ్డీ రేటు
కొత్త నిబంధనల ప్రకారం, ఒకే రోజున ఒకే మొత్తానికి సంబంధించిన డిపాజిట్లపై బ్యాంకులు తమ అన్ని శాఖల్లో ఒకే విధమైన వడ్డీ రేటును అందించాల్సి ఉంటుంది. అదే విధంగా, ఒకే మొత్తంలో డిపాజిట్‌ను ఒకే రోజున స్వీకరించినప్పుడు, కస్టమర్ల మధ్య వడ్డీ చెల్లింపులో వివక్ష ఉండకూడదని RBI స్పష్టం చేసింది. ఈ నిబంధనలు సాధారణ డిపాజిట్లతో పాటు బల్క్ డిపాజిట్లకు కూడా వర్తిస్తాయి.
తాజావార్తలు
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!