Site icon NTV Telugu

వారెన్ బఫెట్ వారసుడు అతనేనా? 

వారెన్ బఫెట్ పేరు తెలియని వ్యక్తులు బహుశా ఉండరు.  బిజినెస్ అంటే ఆయనకు ఎంతటి ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు.  బిజినెస్ రంగంలో ఆయన ఉన్నతమైన శిఖరాలు అధిరోహించారు.  బెర్క్ షైర్ హత్ వే సామ్రాజ్యాన్ని ప్రపంచం నలుమూలల స్థాపించారు.  స్టాక్ మార్కెట్ రంగంలో ఆయనకు తిరుగులేదు.  ప్రస్తుతం ప్రస్తుతం బఫెట్ వయస్సు 90 ఏళ్ళు.  గతపదేళ్లుగా బఫెట్ వారసుడి గురించి చర్చలు నడుస్తున్నాయి.  తాజాగా బఫెట్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించే వారసుడిని ప్రకటించారు.  బఫెట్ వారసుడిగా బెర్క్ షైర్ హాత్ వే వైస్ ప్రెసిడెంట్ గ్రెగ్ అబెల్ ను ప్రకటించారు.  గ్రెగ్ అబెల్ వారసత్వాన్ని బోర్డు కూడా అంగీకరించినట్టు బఫెట్ పేర్కొన్నారు.  అబెల్ తో పాటు మరో వైస్ చైర్మన్ అజిత్ జైన్ పేరును కూడా పరిశీలించారు.  కానీ అజిత్ జైన్ వయసు 69 ఏళ్ళు ఉండటంతో, గ్రెగ్ అబెల్ ను వారసుడిగా ప్రకటించారు.  

Exit mobile version