NTV Telugu Site icon

Google Pay Loans: గూగుల్ పే వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై రూ.50లక్షల లోన్

Gpayloans

Gpayloans

గూగుల్ పే వినియోగదారులకు ఆ సంస్థ దసరా పండుగ శుభవార్త చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ డబ్బు అవసరం ఉంటుంది. కొన్ని సార్లు బ్యాంకులు చుట్టూ తిరిగినా ప్రయోజనం ఉండదు. పైగా అన్ని ఉన్నా.. ఏదొకటి మెలికపెడుతుంటారు. ఒకవేళ అన్ని ఉన్నా కూడా లోన్ మంజూరు చేయడానికి ఎక్కువ రోజులు తీసుకుంటారు. ఈ తలనొప్పులు ఎందుకులే అనుకుని ఆశలు వదలుకుంటారు. కానీ గూగుల్ పే మాత్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇంట్లో నుంచే గూగుల్ పే యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో లోన్ పొందే అవకాశం కల్పించింది.

గూగుల్ పే యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో లోన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. రూ. 50 లక్షల వరకు గూగుల్ పే నుంచి గోల్డ్ లోన్స్ తీసుకునే అవకాశం ఉంది. అందుకోసం ముత్తూట్ ఫైనాన్స్ సంస్థతో డీల్ కుదుర్చుకుంది. ఇక పర్సనల్ లోన్స్ అయితే రూ. 5 లక్షల వరకు తీసుకునే వెసులుబాటు కల్పించింది.

అర్హతలు ఏంటంటే..
1. Google Payలో UPI IDని కలిగి ఉండాలి
2. వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 57 సంవత్సరాలుండాలి
3. CIBIL స్కోర్ కనీసం 600 ఉండాలి
4. ఇతర బ్యాంక్‌లో డిఫాల్ట్‌గా ఉండకూడదు

అవసరమైన పత్రాలు ఇవే..
1. ఆధార్ కార్డ్
2. పాన్ కార్డ్
3. ఇన్‌కమ్ సర్టిఫికెట్
4. మొబైల్ నంబర్
5. ఇ-మెయిల్ ఐడీ
6. 4 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్
7. పాస్‌పోర్ట్ సైజు ఫోటో

ఎలా దరఖాస్తు చేయాలంటే..
1. Google Pay యాప్‌ను ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేయాలి
2. ఫోన్ నంబర్ వివరాలను నమోదు చేయాలి
3. జీ పేలో బిజినెస్ ఫీచర్‌ను ఓపెన్ చేయాలి
4. ఫైనాన్స్ ఫీచర్‌లో లోన్స్ యాప్స్ ఉంటాయి
5. నచ్చిన దానిని ఎంపిక చేసుకుని దరఖాస్తు చేయవచ్చు
6. అర్హతను బట్టి లోన్ మంజూరు
7. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే రిజెక్ట్ అయ్యే ఛాన్స్
8. ఇతర బ్యాంకుల్లో లోన్స్ ఉంటే వచ్చే ఛాన్స్ తక్కువ