Site icon NTV Telugu

Google Pay: యూజర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్..ఈజీ పేమెంట్స్..!

Gpay

Gpay

కరోనా తర్వాత డిజిటల్ పేమెంట్స్ ను ఎక్కువ చేస్తున్నారు..యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ట్రాన్సాక్షన్లతో అగ్రస్థానం. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఏదో ఒక యూపీఏ వాడుతున్నారు. అందులో ఎక్కువగా వినిపించే పేరు గూగుల్ పే. ఈ పేమెంట్ యాప్ వాడుతున్న వారికి అదిరే గుడ్‌న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022 సెప్టెంబర్‌లో యూపీఐ లైట్ పేరుతో కొత్త పేమెంట్స్ వ్యవస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే..

బ్యాంక్ సంబంధిత సమస్యల నుంచి ప్రతి విషయంలో ఫెయిల్యూర్స్ కాకుండా యూజర్లు రోజు వారీ చిన్న చిన్న లావాదేవీలు చేసుకునేందుకు ఈ యూపీఐ లైట్ తీసుకొచ్చింది ఆర్‌బీఐ. ఇప్పుడు ఈ ఫీచర్‌ను తమ యాప్‌లో అందుబాటులోకి తెచ్చింది గూగుల్ పే. ఇకపై గూగుల్ పే యూజర్లు ఎలాంటి పిన్ అవసరం లేకుండానే రోజు వారీ సరుకులు, స్నాక్స్ మొదలగు కొన్నిటికి ఈ సర్వీస్ అందుబాటులోకి రానుందని తెలుస్తుంది..గూగుల్ పే యూజర్లు యూపీఐ లైట్ అకౌంట్ ద్వారా ఒకసారి రూ.200 వరకు పేమెంట్స్ చేయవచ్చు. ఈ పేమెంట్స్ చేసేందుకు ఎలాంటి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. యూపీఐ లేట్ అనేది యూజర్ల బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయి ఉంటుంది. రియల్ టైమ్‌లో కోర్ బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానంలో లేకపోయినా ఈ ఫీచర్ పని చేస్తుంది…

ఈ ఫీచర్ ను ఎలా ఉపయోగించాలంటే..?

*. ముందుగా యాప్ ను ఓపెన్ చెయ్యాలి..
*. ఫోన్ స్క్రీన్‌పై టాప్ రైట్ కార్నర్‌లో కనిపిస్తున్న ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి.
*. ఆ తర్వాత కిందకు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ యూపీఐ లైట్ ఫీచర్ ఆప్షన్ కనిపిస్తుంది.
*. యూపీఐ లైట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కొత్త స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అందులో యూపీఐ లైట్ పూర్తి వివరాలు ఉంటాయి.
*. తర్వాత యూపీఐ లైట్ యాక్టివేట్ ఆప్షన్ పై నొక్కాలి.
*. మీ బ్యాంక్ ఖాతాను లింక్ చేసి ఆన్ స్క్రీన్ సూచనలను ఫాలో కావాలి.
*. ఈ ప్రాసెస్ మొత్తం పూర్తయిన తర్వాత మీకో కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది…
*. మీ అకౌంట్లోకి డబ్బులను యాడ్ చేసుకోవచ్చు.. అంతే…

Exit mobile version