Google: 2022 చివర్లో ప్రారంభమైన టెక్ లేఆఫ్స్ 2024లో కొనసాగుతున్నాయి. ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక మందగమనం వల్ల వేలాది మంది ఉద్యోగులను ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీలు తొలగించాయి. ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్ ప్రపంచంలోకి శరవేగంగా దూసుకురావడం కూడా ఉద్యోగుల పాలిట శాపంగా మారింది.
Read Also: Hanuman: హనుమాన్ షూట్లో రెండు ప్రమాదాలు.. ‘తేజ’ను కాటేయబోయిన నల్లత్రాచు
ఇప్పటికు గూగుల్ సంస్థ పలుమార్లు తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. తాజాగా వందలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకనుంది. గూగుల్ తన వాయిస్-యాక్టివేటెడ్ గూగుల్ అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్, నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్ టీమ్‌ల నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు నిర్ణయించింది. దీనిని గూగుల్ ప్రతినిధి బుధవారం ధృవీకరించారు. ఈ నిర్ణయం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెజెన్స్ సాంకేతికతను సమగ్రపరచడం ద్వారా గూగుల్ అసిస్టెంట్‌ను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు గూగుల్ చెబుతోంది. గూగుల్ అసిస్టెంట్‌ని మరింత మెరుగుపరిచేందుకు తన AI చాట్‌బాట్ బార్డ్‌ని ఉపయోగించాలని యోగిస్తోంది. ఈ అప్‌గ్రేడెడ్ వెర్షన్ యూజర్లకు వాయిస్‌కి మించి సేవలందిస్తుందని, యూజర్లకు ఏం కావాలో అర్థం చేసుకుని పనులను నిర్వహించగలదని భావిస్తున్నట్లు సంస్థ చెబుతోంది. 2023 జనవరిలో 12,000 మంది ఉద్యోగులను గూగుల్ తొలగించింది. ఒక్క గూగుల్ మాత్రమే కాదు అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ వంటి సంస్థలు కూడా వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తీసేశాయి.
