NTV Telugu Site icon

Google halt hiring: గూగుల్‌ కీలక నిర్ణయం.. హైరింగ్ ప్రక్రియ నిలిపివేత‌..

Google

Google

సెర్చింజ‌న్ గూగుల్ రెండు వారాల పాటు నియామ‌కాల‌ను నిలిపివేయాల‌ని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్ధిక సంవ‌త్సరం తొలి త్రైమాసికంలోనే… గూగుల్ ఏకంగా 10 వేల మందిని రిక్రూట్ చేసుకుంది. ఈ ఏడాది రాబోయే క్వార్టర్లలో నియామ‌కాల ప్రక్రియ మంద‌కొడిగా సాగుతుంద‌ని… గూగుల్ సీఈవో వెల్లడించిన కొద్దిరోజుల‌కే… హైరింగ్ ప్రక్రియ నిలిపివేత‌పై గూగుల్ నిర్ణయం వెలువ‌డింది. హైరింగ్ ప్రక్రియ నెమ్మదించిన కీల‌క రోల్స్‌లో ఇంజ‌నీర్లు, ఉద్యోగుల హైరింగ్ పునరుద్ధరిస్తామ‌ని పిచాయ్ పేర్కొన్నారు.

Read Also: Minister Gudivada Amarnath: చంద్రబాబులా పబ్లిసిటీ కాదు.. ప్రజలకు సాయం చేయాలన్నదే మా ఆలోచన..

మేం ఈ సమయాన్ని మా హెడ్‌కౌంట్ అవసరాలను సమీక్షించడానికి, రాబోయే మూడు నెలల కోసం కొత్త ప్రాధాన్యత కలిగిన స్టాఫింగ్ రిక్వెస్ట్‌లను పరిశీలించడానికి ఉపయోగిస్తాము అని పేర్కొన్నారు గూగుల్‌ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రాఘవన్.. నియామక స్తంభన ఇప్పటికే పనిలో ఉన్న ఆఫర్లను మాత్రం ప్రభావితం చేయదు.. కానీ, కాంట్రాక్ట్ పొడిగింపు కోరుకునే కార్మికులను ప్రభావితం చేయవచ్చు అన్నారు.. సీఈవో సుందర్‌ పిచాయ్‌ ప్రకటించినట్లుగా మేం నియామకాలను మందకొడిగా చేపడుతున్నాం.. దానికి అనుగుణంగా, రెండు వారాల పాటు హైరింగ్‌ ప్రక్రియ నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు. గత మరియు ప్రస్తుత ఆర్థిక త్రైమాసికాల్లో వార్షిక లక్ష్యాన్ని ఇప్పటికే చేరుకున్నందున నియామకాల్లో స్పీడ్‌ తగ్గిందని గూగుల్ పేర్కొంది. గూగుల్, దాని టెక్ కౌంటర్‌పార్ట్‌ల మాదిరిగానే, విదేశీ మారకపు హెచ్చుతగ్గుల కారణంగా అనిశ్చితిని ఎదుర్కొంటోంది. కాగా, స్నాప్ మరియు మెటా వంటి కంపెనీలు కూడా నియామక ప్రక్రియలో స్పీడ్‌ తగ్గించాయి.. ఈ నెల ప్రారంభంలో, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య మైక్రోసాఫ్ట్ తన 180,000 మంది ఉద్యోగులలో కొంత భాగాన్ని (1 శాతం) తొలగించినట్లు నివేదించబడింది. టెక్ దిగ్గజం విండోస్ టీమ్స్ నియామకాలను నెమ్మదిగా చేయాలని నిర్ణయించాయి.