NTV Telugu Site icon

గూగుల్ కీలక నిర్ణయం.. 8 ఏళ్ల త‌ర్వాత మార్చేసింది..

టెక్ దిగ్గ‌జం గూగూల్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.. వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ లోగోనూ మార్చ‌బోతోంది.. 2014లో క్రోమ్ లోగోలో స్వల్పంగా మార్పులు చేసిన గూగుల్‌.. ఇప్పుడు.. అంటే ఎనిమిదేళ్ల త‌ర్వాత దాని డిజైన్‌ను మార్చేస్తోంది.. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది టెక్ దిగ్గ‌జం.. గూగుల్ క్రోమ్ డిజైనర్ ఎల్విన్ హు తన ట్విట‌ర్ ఖాతాల్లో ఈ విష‌యాన్ని షేర్ చేశారు.

Read Also: పాఠ్యాంశాల్లో మార్పు వ‌స్తేనే.. స‌మాజంలో మార్పు.. వారి చ‌రిత్ర చించేయాలి..!

క్రోమ్‌ కొత్త ఐకాన్‌ను మీరు ఈ రోజు గమనించే ఉంటారు… 8 ఏళ్ల తర్వాత క్రోమ్‌ బ్రాండ్‌ ఐకాన్‌ను రిఫ్రెష్‌ చేస్తున్నాం అంటూ రాసుకొచ్చారు ఎల్విన్ హు.. ఇక‌, లోగో విష‌యానికి వ‌స్తే.. పాత లోగోలో ఉన్న‌ట్టుగా ఇప్పుడు కొత్త బ్రాండ్‌ ఐకాన్‌లో షాడోలు లేకుండా చేశారు.. అయితే, లోగోలో కినిపించే ఆ పాత నాలుగు రంగులు మునుపటి కంటే ఇప్పుడు మెరుస్తున్నాయి.. మధ్యలోని నీలిరంగు వృత్తం సైజ్‌ను కొంచెం పెంచారు.. గూగుల్ యొక్క ఆధునిక బ్రాండ్ వ్యక్తీకరణకు అనుగుణంగా ఈ మార్పులు చేయబడ్డాయ‌ని హు పేర్కొన్నారు.. మ‌రోవైపు విండోస్‌ సహా వివిధ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ల కోసం ఈ లోగోను తయారు చేసిన‌ట్టు హు వెల్ల‌డించారు.. డెస్క్‌టాప్‌, ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్ల అందరికీ కూడాఈ లోగోలో త్వ‌ర‌లోనే అందుబాటులోకి వ‌స్తుంద‌న్నారు..