Site icon NTV Telugu

Gold : తులం బంగారానికి లక్ష.. అయినా ఆగట్లేదుగా..

Gold

Gold

Gold : తులం బంగారం లక్ష రూపాయలకు దగ్గరైంది. అవును మీరు విన్నది నిజమే. బంగారం చరిత్రలోఎన్నడూ లేనంతగా భారీ ధరకు చేరుకుంది. గత ఏడాది కాలంగా ప్రతి రోజూ బంగారం పెరుగుతూనే పోతోంది. లక్ష రూపాయలకు కొద్దిపాటి దూరంలోనే ఉంది. మరికొన్ని గంటల్లోనే లక్షను క్రాస్ చేసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98350కి చేరుకుంది. ఇది హైదరాబాద్ లో ధర. బంగారం ఇంతటి గరిష్ట స్థాయికి మునుపెన్నడూ రాలేదు. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90150గా ఉంది.
Read Also : HHVM : వీరమల్లు రిలీజ్ డేట్ అప్పుడేనా.. పవన్ ఫిక్స్ అయ్యారా..?

ఇండియాలో బంగారానికి భారీగా డిమాండ్ పెరుగుతోంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలినా బంగారం ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. మిగతా బ్రాండ్ల మీద కంటే బంగారం మీదనే పెట్టుబడులు పెడుతున్నారు. పైగా ఇప్పుడు ఇండియాలో పెళ్లిళ్ల సీజన్. ఈ లెక్కన బంగారానికి మరింత డిమాండ్ ఏర్పడుతోంది. పైగా రియల్ ఎస్టేట్, ఫిక్స్ డ్ డిపాజిట్లపై పెద్దగా లాభం లేదని.. బంగారం మీదనే భారతీయులు పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పుడు బంగారం ధరించడానికే కాదు.. అవసరానికి ఉపయోగపడే వస్తువుగా చూస్తున్నారు. అందుకే ఈ స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ధరలు ఇంకెంత పెరుగుతాయో అర్థం కావట్లేదు.

Exit mobile version