NTV Telugu Site icon

Gold Price Today : భగ్గుమంటున్న బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంతంటే?

Gold Price

Gold Price

బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా పెరిగాయి.. దేశంలో బంగారం ధరలు శనివారం పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 150 పెరిగి.. రూ. 57,700కి చేరింది..24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 170 వృద్ధి చెంది.. రూ. 62,950కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 62,780గా ఉండేది. వెండి ధరలను చూస్తే ఈరోజు వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదు.. మార్కెట్ లో స్థిరంగా ఉన్నాయి.. ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

*. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,850గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,100గా ఉంది.
*. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 62,950గా ఉంది.
*. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
*. కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,2250గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,660గా ఉంది.
*. పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,700గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,950గాను ఉంది..
*. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ధరలు 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,700గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,950గా నమోదైంది..

ఇక వెండి ధరలను చూస్తే.. శనివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,720గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 77,200గా కొనసాగుతోంది..హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 80,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 77,200.. బెంగళూరులో రూ. 76,000గా ఉంది.. ఈరోజు వెండి ధరలు ఊరట కలిగిస్తున్నాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..