మహిళలకు గుడ్ న్యూస్.. మళ్లీ బంగారం ధరలు తగ్గుతున్నాయి.. నేడు మార్కెట్ లో స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి … ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 రూపాయలు తగ్గి,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,720 గా ఉంది. వెండి కిలో రూ.75,500 లుగా కొనసాగుతోంది. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. శుక్రవారం కిలో వెండిపై రూ.100 మేర తగ్గింది.. రూ. 74,900 వద్ద కొనసాగుతుంది..ఇక ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,640 ఉంటే.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,870 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,990, 24 క్యారెట్ల ధర రూ.63,220, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720 గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720 గా కొనసాగుతోంది.. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో పసిడి ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,720 గా ఉంది.
వెండి విషయానికొస్తే.. ఈరోజు మార్కెట్ లో వెండి ధరలు తగ్గాయి.. కిలో వెండి పై రూ. 100 మేర తగ్గింది.. ముంబైలో రూ.74,900, చెన్నైలో రూ.76,400, బెంగళూరులో రూ.72,300, , కోల్‌కతాలో రూ.74,900 ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.76,400 గా ఉంది..ఈరోజు స్వల్పంగా తగ్గిన ధరలు రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..