ఈరోజు బంగారం కొనాలనుకొనేవారికి షాకింగ్ న్యూస్.. మార్కెట్ లో ధరలు భగ్గుమంటున్నాయి.. నిన్నటి ధరల తో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. ఒక్కరోజులో అంతపెరగడం గమనార్హం.. ఈరోజు తులం బంగారం పై ఏకంగా రూ.600 మేర పెరిగింది.. అదే విధంగా వెండి ధరలు కూడా.. కిలో వెండి పై రూ.1500 పెరిగింది..ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 650 పెరిగి రూ. 61, 690 గా నమోదు కాగా… అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 600 పెరిగి రూ. 56, 550 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా భారీగానే పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 1500 పెరిగి రూ. 79, 500 గా నమోదు అయింది.. ప్రధాన నగరాల్లో ధరలను చూద్దాం..
*. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,700గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,840గా ఉంది.
*. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,550 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 61,690గా ఉంది.
*. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
*. అదేవిధంగా చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,000గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,180గా ఉంది.
*. పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 56,550గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 61,690గాను ఉంది..
*. మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,550గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,690గా నమోదైంది.
ఇక వెండి విషయానికొస్తే.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 79,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 76,500.. బెంగళూరులో రూ. 75,500గా ఉంది.. ఈరోజు భగ్గుమంటున్న ధరలు రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..