NTV Telugu Site icon

Gold Price Today : షాకిస్తున్న బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే?

Gld

Gld

బంగారం ధరలు రెండు రోజులుగా పరుగులు పెడుతున్నాయి.. నిన్న కాస్త పెరిగిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో భారీగా పెరిగాయి..ఒక్క రోజే తులంపై ఏకంగా రూ. 150 వరకు పెరగడం గమనార్హం. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. మంగళవారం పెరిగిన ధరలతో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది.. ఇక ఈరోజు వెండి ధరలు మాత్రం తగ్గినట్లు తెలుస్తున్నాయి.. ఇక ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఇక ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 55,400 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 60,440కి చేరింది. ఇక ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050కి చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,200గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 60,210గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,050, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 60,080 వద్ద కొనసాగుతోంది.. అదేవిధంగా.. హైదరాబాద్‌లో మంగళవారం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,050కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,080గా ఉంది.

బంగారం పరుగులు పెడితే వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి..మంగళవారం కిలో వెండిపై ఏకంగా రూ. 200 తగ్గడం విశేషం. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది.. ఢిల్లీలో మంగళవారం కిలో వెండి ధర రూ. 74,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,000, ముంబయిలో రూ. 74,500, బెంగళూరులో 74,000 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 78,200గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

Show comments