Gold Price Today: శ్రావణ మాసం వేళ గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఢమాల్.. 24K, 22K రేట్లు ఇవే

  • తగ్గిన బంగారం, వెండి ధరలు
  • రూ.710 తగ్గి రూ.1,52,890కి చేరిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర
  • రూ.650 తగ్గి రూ.1,40,150కి చేరిన 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్
Gold

Gold

ఎంతో విశిష్టంగా భావించే శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో శుభకార్యాలకు ముహూర్తాలు ఖరారు చేసుకుంటుంటారు. వివాహాది శుభకార్యాలతో పాటు పలు రకాల ఫంక్షన్స్ కూడా నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా బంగారం కొనుగోళ్లకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరి మీరు కూడా గోల్డ్ కొనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. తులం గోల్డ్ ధర రూ. 710 తగ్గింది. కిలో వెండి ధర రూ. 5000 తగ్గింది.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు.. 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) గ్రాముకు రూ.15,289, 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత) గ్రాముకు రూ.14,015, 18 క్యారెట్ల బంగారం (75% స్వచ్ఛత) గ్రాముకు రూ.11,467గా సేల్ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్‌ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 710 పెరిగి రూ.1,52,890 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 650 పెరిగి రూ.1,40,150 వద్దకి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,53,040 వద్ద అమ్ముడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,300 వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో కిలో సిల్వర్ ధర రూ. 5000 తగ్గడంతో రూ.2,55,000 వద్ద సేల్ అవుతోంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 2,55,000 వద్దకి చేరింది.