NTV Telugu Site icon

Gold Price Today : గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం.. వెండి ధర ఎంతంటే?

Gld Price

Gld Price

పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. దేశంలో బంగారం ధరలు గురువారం తగ్గాయి. 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 350 దిగొచ్చి.. రూ. 57,700కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం 10గ్రాములు ధర రూ. 380 తగ్గి.. రూ. 62,950కి చేరింది.. అదే విధంగా వెండి ధర కిలో పై రూ. 600 తగ్గి.. రూ. 75,900కి చేరింది.. ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,850గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,100గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 62,950గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,100గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,380గా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,700గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,950గా నమోదైంది..

బంగారం ధర తగ్గితే, వెండి ధరలు కూడా తగ్గాయి.. రూ. 600 తగ్గి.. రూ. 75,900కి చేరింది.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 77,400 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 75,900.. బెంగళూరులో రూ. 73,750గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..