NTV Telugu Site icon

Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే?

Gold (3)

Gold (3)

పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బంగారం కొనాలేనుకొనేవారికి ఇది శుభవార్తే.. వరుసగా ధరలు కిందకు దిగి వస్తున్నాయి.. మార్కెట్ లో నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు భారీగా ధరలు తగ్గాయి.. శనివారం మార్కెట్ లో నమోదు అయిన ధరలను చూస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,650 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,530 గా ఉంది. పది గ్రాముల బంగారంపై రూ.250 నుంచి 270 రూపాయల మేర ధర తగ్గింది. అయితే శనివారం వెండి ధరలు మాత్రం అమాంతం పెరిగాయి. కిలో వెండిపై రూ.1000 మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.74,700 పలుకుతోంది.. మరి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

*. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.53,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.58,530 గా ఉంది.

*. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.53,650, 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,530 ఉంది..

*. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,900, 24 క్యారెట్ల ధర రూ.58,800 గా ఉంది.

*. కేరళ, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో 22 క్యారెట్ల ధర రూ.53,650, 24 క్యారెట్లు రూ.58,530లకు లభిస్తోంది..

*. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,650గా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.58,530 గా ఉంది..

ఇకపోతే బంగారం ధరలు తగ్గితే.. వెండి ధరలకు రెక్కలు వచ్చాయి.. ఈరోజు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయంటే?

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,700గా ఉండగా.. ముంబైలోనూ ఇదే ధర పలుకుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.77,500, బెంగళూరులో రూ.72,500, కేరళలో రూ.77,500, కోల్‌కతాలో రూ.74,700 లుగా ట్రేడింగ్‌ అవుతోంది. హైదరాబాద్‌లో వెండి ధర రూ.77,500 పలుకుతోంది.. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..