NTV Telugu Site icon

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు..తులం ఎంతంటే?

Gld Price

Gld Price

దేశంలో బంగారం ధరలు ఎప్పుడూ ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే.. ఈ మధ్య రెండు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి.. ఈరోజు కాస్త ఊరటను కలిగిస్తుంది.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది..తాజాగా దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 వరకు తగ్గుగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.160 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక అక్టోబర్‌ 18వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

*. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,160 ఉంది.

*. ముంబైలో 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.54,950 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,950 వద్ద కొనసాగుతుంది.

*. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,100 వద్ద ఉంది.

*. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,950 వద్ద ఉంది.

*. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,950 ఉంది.

*. తెలుగు రాష్ట్రాల్లో..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,950 ఉంది..

ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండిపై రూ.500 వరకు తగ్గింది. ప్రస్తుతం దేశంలో కిలో సిల్వర్‌ ధర రూ.73,600 వద్ద కొనసాగుతోంది. దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో ఇదే ధరతో కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..