NTV Telugu Site icon

Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్.. నేడు బంగారం, వెండి ధరలు ఎంతంటే?

Gold Rates

Gold Rates

మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఈరోజు బంగారం కొనాలని అనుకొనేవారికి ఊరట..పసిడి ధరలు గత గత నాలుగు రోజుల నుంచి భగ్గుమంటున్నసంగతి తెలిసిందే. తులం రేటు రూ. 60 వేలు దాటింది. అయితే, ఇవాళ బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతూ స్వల్ప ఊరట కలిగించాయి.. బంగారం ధరలు తగ్గితే.. వెండి ధరలకు మాత్రం పరుగులు పెడుతున్నాయి..కిలో వెండి రేటు గడిచిన నాలుగు రోజుల్లో సుమారు రూ. 5 వేలు పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో ఇవాళ గోల్డో, సిల్వర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

నేడు హైదరాబాద్ మార్కెట్లో చూసుకుంటే బంగారం ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. క్రితం రోజున తులం బంగారం రేటు రూ. 60 వేలు మార్క్ చేరిన విషయం తెలిసిందే. ఈరోజు కూడా అదే ధర వద్ద స్థిరంగా ఉంది. 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 55 వేలు పలుకుతుండగా.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు ఇవాళ రూ. 60 వేలకు ట్రేడుతోంది. దేశ రాజధాని ఢిల్లీ లో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం రేటు తులాని కి రూ. 55 వేల 150 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 60,150 వద్ద కొనసాగుతోంది..

ఈరోజు బంగారం స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం పరుగులు పెడుతున్నాయి.. దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో చూసుకుంటే కిలో వెండి రేటు గత నాలుగు రోజుల్లోనే రూ. 4000 మేర పెరిగింది. ఇవాళ రూ. 400 పెరిగి ప్రస్తుతం కిలో రేటు రూ. 77 వేల 500 మార్క్ దాటింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో చూసుకుంటే గత నాలుగు రోజుల్లో కిలో రేటు ఏకంగా రూ. 4800 పెరగడం గమనార్హం. ప్రస్తుతం కిలో వెండి హైదరాబాద్‌లో చూసుకుంటే రూ. 81 వేల 800 పలుకుతోంది.. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా నేడు బంగారం ధరలు దిగి వచ్చాయి.. ఇక రేపు ఎలా ఉంటాయో చూడాలి..