Site icon NTV Telugu

Gold Price Today: వరుసగా రెండోరోజు షాక్.. రూ.2,460 పెరిగిన బంగారం ధర! వెండిపై 3 వేలు

Gold Price Today

Gold Price Today

2025 దీపావళి పండగ తర్వాత బంగారం ధరలు భారీగా పతనం కావడంతో.. పసిడి ప్రేమికులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవలి రోజుల్లో గోల్డ్ రేట్స్ భారీగా పతనం అయ్యాయి. ఎంత త్వరగా పడిపోయాయో.. అంతే స్పీడ్‌గా పసిడి పరుగులు పెడుతోంది. వరుసగా రెండోరోజు బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. నిన్న తులం బంగారం ధర రూ.1800 పెరిగితే.. ఈరోజు రూ.2,460 పెరిగింది. ఈ రెండు రోజులోనే తులం పసిడిపై రూ.4,260 పెరిగింది. బంగారం ధరలు భారీగా పెరుగుతుండటంతో పసిడి ప్రేమికులు మరలా ఆందోళనకు గురవవుతున్నారు.

మంగళవారం (నవంబర్ 11) బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,460 పెరిగి.. రూ.1,26,280గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.2,250 పెరిగి.. రూ.1,15,750గా ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,26,280గా.. 22 క్యారెట్ల ధర రూ.1,15,750గా నమోదయింది. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,27,640గా.. 22 క్యారెట్ల రేటు రూ.1,17,000గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,26,430గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,15,900గా ట్రేడ్ అవుతోంది.

Also Read: Zelio Electric Scooter: సింగిల్ ఛార్జింగ్‌పై 90km ప్రయాణం.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర తక్కువ, ఫీచర్స్ ఎక్కువ!

మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరుగుతోంది. వరుసగా మూడు రోజులు స్థిరంగా ఉన్న వెండి ధరలు రెండు రోజలుగా దూసుకెళుతోంది. కిలో వెండిపై నిన్న రూ.4,500 పెరగగా.. ఈరోజు రూ.3,000 పెరిగింది. మంగళవారం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,60,000గా నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1,70,000గా ట్రేడ్ అవుతోంది. బంగారం, వెండి ధరల్లో ప్రాంతాల వారీగా హెచ్చుతగ్గులు ఉంటాయన్న విషయం తెలిసిందే. జీఎస్‌టీ అదనంగా ఉంటుందన్న విషయం గుర్తించుకోవాలి.

Exit mobile version