NTV Telugu Site icon

Gold Price Today: మళ్లీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంతంటే?

Gold (3)

Gold (3)

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. పసిడి ధరలకు ఈరోజు రెక్కలోచ్చాయి.. గత మూడురోజులుగా పెరుగుతున్న ధరలు, ఈరోజు కూడా భారీగా పెరిగాయి.. మార్కెట్ లో నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా పెరిగాయి.. ఈరోజు తులం మీద రూ.380 రూపాయలు పెరిగింది.. అంటే గ్రాము పై రూ.38 రూపాయలు పెరిగింది.. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 58,910గా ఉంది. గురువారం నాడు ఇదే బంగారం గ్రాములకు రూ. 58,530 చొప్పున ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధరలోనూ మార్పుు చోటు చేసుకుంది. 22 క్యారెట్ల బంగారం గ్రాముపై రూ. 35 చొప్పున పెరిగి 10 గ్రాములు రూ. 54,000 లకు చేరుకుంది..ఇక వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ.500 పెరిగి రూ. 75, 500 గా నమోదు అయింది.

ఈరోజు ప్రధాన మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

* చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,070కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 58,980గా ఉంది.

* ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 54,050కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 58,930గా ఉంది.

* ఇక ఢిల్లీలో 22 క్యారెట్స్ ధర రూ. 54,300 కాగా, 24 క్యారెట్స్‌ గొల్డ్‌ ధర రూ. 59,180గా ఉంది.

* కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,150గా ఉండగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 58,930 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్‌ ధర రూ. 53,950కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 58,830 వద్ద కొనసాగుతోంది.

* తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,650గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 58,910గా ఉంది.

* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 54,000 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 58,910 వద్ద కొనసాగుతోంది..

బంగారం పెరిగితే, ఈరోజు వెండి కూడా పరుగులు పెట్టింది.. ఈరోజు భారీగా ధరలు పెరిగాయి..హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 75,500 ఉండగా..కోల్‌కతా, ముంబైలలో కూడా ఇదే ధరకు అందుబాటులో ఉంది. అటు బెంగళూరులో కిలో వెండి ధర రూ. 71,500గా ఉంది.. అంటే ఈరోజు బంగారం వెండి రెండు కూడా పరుగులు పెడుతున్నాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..