పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. గత రెండు రోజులుగా పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి.. ఇక ఇవాళ కూడా మార్కెట్ లో స్థిరంగా కొనసాగుతున్నాయి.. రానున్న రోజుల్లో భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర రూ. 63,870 కాగా ఈరోజు కూడా రూ. 63,870 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,550 ఉంది.. ఈరోజు కూడా అవే ధరలు ఉండటం గమనార్హం.. ఇక వెండి ధరల్లో కూడా ఎటువంటి మార్పు లేదు.. స్థిరంగా కొనసాగుతున్నాయి..
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,700లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,970గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,100లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,470గా నమోదైంది.. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 58,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 63,870గా కొనసాగుతోంది..
ఇక వెండి విషయానికొస్తే.. బంగారం స్థిరంగా ఉంటే, వెండి కూడా అదే దారిలో నడిచింది.. ఈరోజు కిలో వెండి ధర రూ. 78,600లుగా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 78,600గా ఉంది. చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,000 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో మాత్రం అత్యల్పంగా 76,000గా ఉంది. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..