బంగారం కొనాలనుకుంటున్న వారికి షాకింగ్ న్యూస్.. మార్కెట్ లో ధరలు ఎప్పుడు, ఎలా ఉంటాయో చెప్పడం కాస్త కష్టమే.. ఈరోజు మార్కెట్ లో స్వల్పంగా ధరలు పెరిగాయి.. శనివారం ధరలు పెరిగాయి.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150లు పెరిగి, రూ.58,300లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.160లు పెరిగి రూ.63,600ల వద్ద కొనసాగుతోంది.. ఇక వెండి కూడా అదే దారిలో వెండి కూడా నడుస్తుంది.. వెండి ధరలు భారీగా పెరిగాయి.. కిలో పై రూ. 200 పెరిగి రూ.76,500లుగా కొనసాగుతోంది.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,450లు ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.63,750 గా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,300లు ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,600లు, అలాగే చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,900లు, 24 క్యారెట్ల ధర రూ.64,250లు ఉంది. అలాగే, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,300లు ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,600లు ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.58,300 ఉండగ, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.63,600 వద్ద కొనసాగుతుంది..
ఇక వెండి ధర విషయానికొస్తే.. వెండి కిలో రూ. 200ల మేర పెరిగి.. రూ.76,500లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.78,000లు, విశాఖపట్నంలో రూ.78,000లు, చెన్నైలో రూ.78,000ల వద్ద కొనసాగుతోంది. ఇక మిగిలిన అన్ని నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి ..