Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?

  • బంగారం, వెండి ధరలు తగ్గుముఖం
  • నేడు తులం గోల్డ్ ధర రూ. 3000 తగ్గింది
  • కిలో సిల్వర్ ధర రూ. 10000కి పడిపోయింది
Gold Silver

Gold Silver

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే మెరుగ్గా రావడం, డాలర్ బలపడటం వంటి కారణాలతో విలువైన లోహాల ధరలపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఇటీవల గరిష్ట స్థాయిల్లో ఉన్న బంగారం, వెండి ధరలు తగ్గాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 3000 తగ్గింది. కిలో సిల్వర్ ధర రూ. 10000కి పడిపోయింది.

తులం గోల్డ్ ధర రూ. 3000 కి దొగొచ్చింది

ఈ రోజు హైదరాబాద్ నగరంలో 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.15,273 గా ఉంది, అదేవిధంగా 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.14,000 గాను, 1 గ్రాము 18 క్యారెట్ల బంగారం ధర రూ.11,455 గా ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 3000 తగ్గి రూ.1,52,730 దగ్గర ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 2750 తగ్గడంతో రూ.1,40,000 కి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర 1,55,910 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,40,150 వద్ద సేల్ అవుతోంది.

×
×
Ad

కిలో సిల్వర్ ధర రూ. 10000కి డౌన్

హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 10000 తగ్గడంతో రూ. 2,70,000 వద్ద సేల్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 2,65,000 వద్ద ట్రేడ్ అవుతోంది.