Site icon NTV Telugu

Gold Prices In India: పసిడి పరుగులను ఆప తరమా? రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర

Gold Price

Gold Price

Gold Prices In India: పేద, మధ్య తరగతి ప్రజలకు అందనంత దూరంగా, వేగంగా మార్కెట్‌లో పసిడి పరుగులు పెడుతుంది. సామాన్యులకు బంగారం కొనాలంటే పసిడి ధరలు దడపుట్టిస్తున్నాయి. రోజురోజుకు వేలకు వేలు పెరుగుతూ ప్రజలను వణికిస్తున్నాయి. రికార్డులు సృష్టిన్న గోల్డ్ ధరలతో సామాన్యులకు దిక్కుతోచడం లేదు. కుమార్తెల పెళ్లి కోసం, మనవరాలు పుట్టిన రోజు అని బంగారు ఆభరణాలు చేయించాలని చూస్తే.. ఆకాశానికి చేరువ అవుతున్న ధరలు సామాన్యులకు పగటి పూట చుక్కలు చూపిస్తున్నాయి. మంగళవారం పసిడి పరుగులు చూసిన వారికి ఆ ధరలు ఆప తరమా అనిపించిందంటే అతిశయోక్తి కాదు. తాజాగా బంగారం ధరలు దేశంలో నయా రికార్డ్ సృష్టించింది.

READ ALSO: MP: కూలీ పని చేసి భార్యను పోలీసుని చేసిన భర్త.. ఎఫైర్ పెట్టుకుని భర్తనే బెదిరించిన మహాతల్లి

ఇంతకీ బంగారం ధర ఎంత అనుకుంటున్నారు..
తాజాగా దిల్లీలో ఒక్కరోజులో రూ.2 వేలకుపైగా పెరిగి రూ.1,18,900లకు చేరుకుంది. ముందు రోజు రూ.1,16,000గా నమోదైన ధర కేవలం ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో రెండు వేలు పెరిగింది. పసిడి పరుగులను అందుకోవాలన్నా తలంపుతో వెండి కూడా దూసుకుపోతుంది. ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ ప్రకారం.. దిల్లీ మార్కెట్‌లో కిలో వెండి రూ.1,39,600కు చేరుకుంది. హెచ్‌-1బీ వీసా రుసుము పెంపు, డాలరుతో పోల్చితే రూపాయి విలువ కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో బంగారం ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

READ ALSO: Paracetamol Pregnancy Safety: గర్భిణీలు పారాసెటమాల్ వాడితే ప్రమాదమా? ట్రంపరితనంలో నిజమెంత!

Exit mobile version