NTV Telugu Site icon

Gold price: మహిళలకు బ్యాడ్ న్యూస్.. పరుగులు పెడుతున్న పుత్తడి.. దిగొచ్చిన వెండి ధర..

Gold Rates

Gold Rates

మహిళలకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలకు రెక్కలోచ్చాయి.. గత రెండు మూడు రోజులుగా తగ్గిన ధరలు నేడు మార్కెట్ లో పుంజుకున్నాయి.. నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.. ఇక వెండి ధరలు మాత్రం దిగొచ్చాయని తెలుస్తుంది..వారం రోజులుగా వరుసగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఇవాళ అంతర్జాతీయంగానూ బంగారం రేటు మళ్లీ పుంజుకునేలా కనిపిస్తోంది. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం..

నేడు హైదరాబాద్ మార్కెట్ పసిడి ధరలు పుంజుకున్నాయి.. ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.150 పుంజుకుంది. ప్రస్తుతం తులం రేటు రూ.54 వేల 250 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల స్వస్ఛమైన బంగారం ధర హైదరాబాద్‌లో 10 గ్రాములకు రూ. 160 పెరిగి ప్రస్తుతం రూ. 59 వేల 180 వద్దకు దిగివచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో చూసినట్లయితే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 54 వేల 400 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 160 పెరిగి రూ. 59 వేల 330 వద్ద కొనసాగుతోంది..

అదే విధంగా వెండి విషయానికొస్తే..దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో ఇవాళ మళ్లీ పడిపోయింది. గడిచిన నాలుగు రోజుల్లో ఏకంగా కిలో వెండి రేటు రూ. 2900 పడిపోయింది. ఇవాళ మాత్రం కిలో రేటు రూ. 400 తగ్గి ప్రస్తుతం రూ. 71,100 మార్క్ వద్ద ట్రేడవుతోంది. అలాగే హైదరాబాద్ మార్కెట్లో చూస్తే కిలో వెండి రేటు రూ. 500 పెరిగింది. ప్రస్తుతం కిలో సిల్వర్ రేటు రూ. 74,500 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో సిల్వర్ రేటు కాస్త ఎక్కువగా నమోదు అయ్యినట్లు తెలుస్తుంది.. అంతర్జాతీయ మార్కెట్ చూస్తే.. పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి.. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఒక ఔన్సుకు 1921 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 22.46 డాలర్ల వద్ద కొనసాగుతోంది.అయితే బంగారం ధరలు మాత్రం రోజు ఒకేలా ఉండవని తెలుస్తుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..