Gold and Silver Rates: 15% దిగుమతి సుంకం పెంపు ఎఫెక్ట్.. బంగారం ధర ఎంత? వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..

  • భారత్‌లో బంగారం ధర మరోసారి పెరిగింది
  • తులం గోల్డ్ పై రూ. 330 పెరిగింది
  • కిలో వెండిపై రూ. 5000 తగ్గింది
Gold And Silver

Gold And Silver

కేంద్ర ప్రభుత్వం బంగారం & వెండి దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15%కి పెంచిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌లో బంగారం ధర మరోసారి పెరిగింది. తులం గోల్డ్ పై రూ. 330 పెరిగింది. వెండి ధరలు మాత్రం కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించాయి. కిలో వెండిపై రూ. 5000 తగ్గింది. ఈ రోజు హైదరాబాద్‌లో బంగారం ధరలు.. 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) గ్రాముకు రూ.16,233, 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత) గ్రాముకు రూ.14,880, 18 క్యారెట్ల బంగారం (75% స్వచ్ఛత) గ్రాముకు రూ.12,175 గా ఉన్నాయి.

ఈ రోజు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 330 పెరిగి రూ.1,62,330 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 300 పెరిగి రూ.1,48,800 వద్దకి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,62,260 వద్ద అమ్ముడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,950 వద్ద ట్రేడ్ అవుతోంది.

×
×
Ad

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో కిలో సిల్వర్ ధర రూ. 5000 తగ్గి రూ.3,15,000 వద్ద సేల్ అవుతోంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 10000 తగ్గి రూ. 3,00,000 కి చేరింది.