Global Vehicle Sales: ప్రపంచంలోని మొత్తం వాహన విక్రయాల్లో దక్షిణ కొరియా సంస్థ హ్యుందాయ్ తనదైన ముద్ర వేసింది. తాజాగా మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది మొదటి 6 నెలల ఫలితాలు వెల్లడించింది. ఆటోమోటివ్ చిప్ కొరత ఉన్నా అమ్మకాల్లో భేష్ అని నిరూపించుకోవటం విశేషం. జనవరి నుంచి జూన్ వరకు మొత్తం 32.99 లక్షల కార్లు సేల్ అయ్యాయి. 51 లక్షలకు పైగా యూనిట్ల విక్రయాలతో టయోటా మోటర్ గ్రూప్ అగ్రస్థానంలో నిలిచింది. 40 లక్షల కార్ల సేల్స్‌తో వోగ్స్‌వ్యాగన్ గ్రూప్ రెండో ర్యాంక్ పొందింది. హ్యుందాయ్ గ్రూప్‌కి చెందిన జెనెసిస్ మోడళ్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి.
ఇందులో హ్యుందాయ్ ఐఓఎన్‌ఐక్యూ-5తోపాఉ కియా ఈవీ-6 అనే ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. ఈ సంస్థ గతేడాది మొదటి ఆరు నెలల్లో 34 లక్షలకు పైగా కార్ల అమ్మకాలతో ఐదో స్థానం నుంచి పైకెదిగింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో హ్యుందాయ్ సేల్స్ 5.1 శాతం తగ్గినప్పటికీ మిగతా పోటీ సంస్థల కన్నా మంచి పనితీరునే కనబరిచింది. ఇదే సమయంలో టయోటా విక్రయాలు 6 శాతం, వోక్స్‌వ్యాగన్ సేల్స్ 14 శాతం పడిపోయాయి. జనరల్ మోటార్స్ విక్రయాలు మరింతగా (19 శాతం) పతనమయ్యాయి.
Jio and Airtel: ఇండిపెండెన్స్ డే సందర్భంగా జియో, ఎయిర్‌టెల్ రీఛార్జ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
మిషన్-2025
5జీ ఇన్‌ఫ్రా రంగంలో 2025 నాటికి రూ.2 ట్రిలియన్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలని, ఇందులో సగం నిధులను వచ్చే రెండేళ్లలోనే ఖర్చుచేయాలని మొబైల్ టవర్ సంస్థలు ముందస్తుగా సంసిద్ధమవుతున్నాయి. దేశంలోని సగం ప్రాంతాల్లో 5జీని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. సెల్ టవర్ల ఫైబరీకరణకి రూ.5-7 ట్రిలియన్లు వ్యయమవుతుందని అంచనా వేస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో 5జీ డేటా అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో టెలికం రంగంలోని కొన్ని కంపెనీలు ఈ మేరకు స్వల్పకాలిక ప్రణాళికలను రచిస్తున్నాయి.
బీపీసీఎల్ భారీ ప్రణాళిక
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) వచ్చే ఐదేళ్లలో రూ.1.4 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. ఈ నిధులను పెట్రో కెమికల్స్ మరియు గ్యాస్ బిజినెస్‌పై ఖర్చు పెట్టాలని చూస్తోంది. కంపెనీ గ్రోత్ కోసం ఇంధనయేతర ఆదాయంపైనా ఫోకస్ పెట్టింది. దేశవ్యాప్తంగా వివిధ సంస్థలకు చెందిన మొత్తం 83,685 పెట్రోల్ బంకులు ఉండగా ఇందులో 20,217 బంకులు బీపీసీఎల్ సొంతం. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ సంస్థ ఈవీ ఛార్జింగ్, హైడ్రోజన్ రంగాల పైనా ఆసక్తి కనబరుస్తోంది.
