Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్‌తో సరికొత్త చరిత్ర!

Gautam Adani

Gautam Adani

Gautam Adani: భారత దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి అమెరికాలో ఊహించని విజయం వరించింది. అదానీ గ్రూప్, గౌతమ్ అదానీపై అమెరికాలో ఉన్న అన్ని రకాల చట్టపరమైన వివాదాలు, పాత కేసులను ఉపసంహరించుకునే దిశగా అమెరికా న్యాయ శాఖ అత్యంత కీలకమైన, నిర్ణయాత్మకమైన అడుగు వేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అదానీ గ్రూప్ అగ్రదేశంలో ఏకంగా 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.84,000 కోట్లకు పైగా) భారీ పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో ఆయనకు ఈ భారీ ఊరట లభించడం గమనార్హం.

$10 బిలియన్ల మెగా ఇన్వెస్ట్‌మెంట్‌తో మారిన సీన్
అదానీ గ్రూప్, గౌతమ్ అదానీకి వ్యతిరేకంగా గతంలో ఉన్న చట్టపరమైన అడ్డంకులన్నింటినీ పూర్తిగా తొలగించేందుకు ట్రంప్ పరిపాలనా యంత్రాంగం సోమవారం వేగంగా చర్యలు చేపట్టింది. ప్రపంచంలోనే అత్యంత సక్సెస్‌ఫుల్ పారిశ్రామికవేత్తలలో ఒకరైన గౌతమ్ అదానీ సాధించిన ఈ విజయం, ఆయన వ్యాపార దృక్పథం ఎంత పారదర్శకమైనదో నిరూపిస్తోందని చెబుతున్నారు. రాయటర్స్ నివేదిక ప్రకారం.. అమెరికాలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి రంగాలలో అదానీ గ్రూప్ ఈ 10 బిలియన్ డాలర్ల మెగా పెట్టుబడిని పెట్టనుందని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే పాత వివాదాలు తొలగిపోవడం అత్యంత కీలకంగా మారింది. దీంతో వాటిపై అమెరికా ప్రభుత్వం సానుకూల ముద్ర వేసిందని చర్చించుకుంటున్నారు.

ఇదే సమయంలో అదానీ గ్రూప్ తన గ్లోబల్ విస్తరణను వేగవంతం చేస్తూ, అమెరికాలోని ఆర్థిక – పౌర వ్యవహారాలను పూర్తిగా పరిష్కరించుకుంది. అమెరికా ఆర్థిక శాఖతో సోమవారం 275 మిలియన్ డాలర్ల బారీ సెటిల్‌మెంట్ ఒప్పందం కుదిరింది. అలాగే ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్’ (SEC) తో నడుస్తున్న ఒక పాత వివాదాన్ని కూడా ఈ కంపెనీ క్లోజ్ చేసుకుంది. దీనికి అమెరికా కోర్టు నుంచి అధికారిక ఆమోదం లభించడమే ఇక బ్యాలెన్స్ ఉంది. అమెరికా వంటి అత్యంత కఠినమైన చట్టాలు, నిబంధనలు ఉన్న దేశంలో అన్ని రకాల లీగల్ ప్రాసెస్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా దాటడం ఒక భారతీయ కంపెనీకి దక్కిన అరుదైన గౌరవంగా చెబుతున్నారు. ఈ అంతర్జాతీయ అడ్డంకులు పూర్తిగా తొలగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా అదానీ గ్రూప్ బ్రాండ్ విలువ మరింత పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో విదేశీ మార్కెట్లలో అనివార్య కారణాలతో ఆగిపోయిన అదానీ గ్రూప్‌ ప్రాజెక్టులన్నీ ఇకపై రెట్టింపు వేగంతో దూసుకెళ్తాయని చెబుతున్నారు. ఈ 10 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి అమెరికా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తే .. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారతదేశం – అదానీ గ్రూప్ పరపతి మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.