November 2025 IPOs: నవంబర్ నెలలో స్టార్ మార్కెట్‌లో ముఖ్యమైంది. ఎందుకంటే నెలలోని మొదటి వారంలోనే నాలుగు IPOలు మార్కెట్లోకి రాబోతున్నాయి. నవంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వారంలో బ్రోకరేజ్ యాప్ కంపెనీ గ్రో సహా మరో మూడు కంపెనీలు IPOలకు రాబోతున్నాయి. ఆ కంపెనీలు ఏంటి, అవి ఎప్పుడు ఐపీఓకు రాబోతున్నాయి, ఎంత మొత్తం నిధులు సేకరించనున్నాయి అనేవి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Bhakti Bharat TV: భారతావనికి ‘భక్తి భారత్’.. ‘భక్తి భారత్ టీవీ’ లోగో ఆవిష్కరణ..
వారం రోజుల్లో నాలుగు ఐపీఓలు
గ్రో : గ్రో కంపెనీ అనేది ప్రముఖ బ్రోకరేజ్ యాప్. దీని మాతృ సంస్థ బిలియనీర్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్ రూ.6,632.30 కోట్ల ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) నవంబర్ 4 నుంచి నవంబర్ 7 వరకు ప్రారంభమవుతుంది. ఇందులో రూ.1,060 కోట్ల తాజా ఇష్యూ, రూ.5,572.30 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉన్నాయి. కంపెనీ షేర్ల ధరను ఒక్కో షేరుకు ₹95 నుంచి ₹100 వరకు నిర్ణయించింది. ఒక్క లాట్ 150 షేర్లను కలిగి ఉంటుంది.
శ్రీజీ గ్లోబల్ FMCG : శ్రీజీ గ్లోబల్ FMCG రూ.85 కోట్ల (సుమారు $1.85 బిలియన్) విలువైన IPOను ప్రారంభిస్తోంది. ఇది పూర్తిగా కొత్త ఇష్యూ. ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ.120 నుంచి రూ.125 ఉండనుంది. సబ్‌స్క్రిప్షన్‌లు నవంబర్ 4 నుంచి 7 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ షేర్లు నవంబర్ 12న NSE SMEలో జాబితా చేయనున్నారు. ప్రతి లాట్‌లో 2,000 షేర్లు ఉంటాయి.
ఫిన్‌బడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ : ఫిన్‌బడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కొత్త ఇష్యూ ద్వారా రూ.71.68 కోట్ల (సుమారు $1.68 బిలియన్) విలువైన ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)ను ప్రారంభించనుంది. ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ.140 నుంచి రూ.142 వరకు ఉంటుంది. దరఖాస్తులు నవంబర్ 6 నుంచి 10 వరకు తెరిచి ఉంటాయి. నవంబర్ 13న NSE SMEలో లిస్టింగ్ జరుగుతుంది. ఒకే లాట్‌లో 2,000 షేర్లు ఉంటాయి. ఇది రిటైల్ పెట్టుబడిదారులకు కనీస పెట్టుబడిగా మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
క్యూరిస్ లైఫ్‌సైన్సెస్ : క్యూరిస్ లైఫ్‌సైన్సెస్ రూ.27.52 కోట్లు విలువైన ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) వచ్చే వారం ప్రారంభం కానుంది. ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ.120 నుంచి రూ.128 వరకు ఉండనుంది. ఇష్యూ నవంబర్ 7 నుంచి 11 వరకు ఉంటుంది. నవంబర్ 14న NSE SMEలో లిస్టింగ్ జరుగుతుంది. ప్రతి లాట్‌లో 2,000 షేర్లు ఉంటాయి.
READ ALSO: Sanju Samson: రాజస్థాన్ రాయల్స్‌కు సంజు శాంసన్ గుడ్ బాయ్.. ఏ జట్టుకు మారుతున్నాడో తెలుసా!
