Site icon NTV Telugu

Flipkart offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్ ప్రారంభం..ఆ స్మార్ట్ ఫోన్ల పై భారీ డిస్కౌంట్స్..

Flipkart Offers

Flipkart Offers

పండగల సీజన్ మొదలైంది.. ఈ కామర్స్ కంపెనీలు కూడా ప్రముఖ బ్రాండ్ వస్తువుల పై అదిరిపోయే ఆఫర్ లను ప్రకటిస్తున్నారు.. అందులో ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్ లపై అదిరిపోయే ఆఫర్స్ ను ప్రకటించింది..ఆఫర్లు నేటి నుంచి నవంబర్ 11 వరకు కొనసాగుతాయి. అయితే ఈ సేల్‌లో ఫ్లాగ్‌షిప్, మిడ్‌రేంజ్, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. యాపిల్ ఐఫోన్లు, కొన్ని శామ్‌సంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ బిగ్ దీపావళి సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లను కొనాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్..ఈ మోడల్ రూ.63,999కి లిస్ట్ అయింది. దీని అసలు ధర రూ.79,900 కాగా, ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కలిపి దీని ధర రూ. 59,999కి తగ్గుతుంది.

ఇకపోతే ఐఫోన్ 14 ధర రూ. 61,999 కాగా, ఫ్లిప్‌కార్ట్ దీన్ని రూ.54,999కి లిస్ట్ చేసింది. స్పెషల్ దివాలీ సేల్‌లో ఈ ఐఫోన్‌పై మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రూ.3వేల బ్యాంక్ డిస్కౌంట్‌తో దీని ధర రూ.51,999కి తగ్గుతుంది.. అంతేకాదు అతి తక్కువ ఈఎంఐ ను కలిగి ఉంది..

శామ్‌సంగ్ గెలాక్సీ F14 5G స్మార్ట్‌ఫోన్ దీపావళి సేల్‌లో రూ. 9,990కి లభిస్తోంది.. నిజానికి ఈ ఫోన్ ఒరిజినల్ ప్రైస్ రూ.17,490 కాగా, తాజా ఆఫర్లలో ఇది రూ.11,490కి లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లతో దీన్ని అతి తక్కువకు సొంతం చేసుకోవచ్చు. నథింగ్ ఫోన్ (2) ఇప్పుడు కేవలం రూ. 33,999కే లభిస్తోంది. గూగుల్ పిక్సెల్ 7a ధర రూ. 31,499కి తగ్గింది. మోటొరోలా ఎడ్జ్ 40 హ్యాండ్‌సెట్ రూ.25,999కి అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో వివో T2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 21,999కి తగ్గింది.. వీటితో పాటు పోకో ఫోనలపై కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి..

Exit mobile version