Site icon NTV Telugu

Groww Success Story: ఓ రైతు కొడుకు రూ.70 వేల కోట్ల కంపెనీకి అధిపతి అయ్యాడు..!

Lalit Keshre

Lalit Keshre

Groww Success Story: ఎప్పుడైనా ఊహించారా.. ఒక రైతు కొడుకు రూ. 70 వేల కోట్ల కంపెనీకి అధిపతి అవుతాడని. కానీ ఒకరు అయ్యారు.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే సంక్లిష్ట ప్రక్రియతో నిరాశ చెందిన ఒక వ్యక్తి, “దీన్ని ఎందుకు సరళీకరించకూడదు?” అని అనుకున్నాడు. ఈ ఆలోచన నేడు దాదాపు రూ.70 వేల కోట్ల విలువైన కంపెనీకి కారణం అయ్యింది. ఇంతకీ ఆ కంపెనీ ఏంటో తెలుసా.. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ గ్రోవ్. ఈ కంపెనీ మాతృ సంస్థ బిలియన్‌బ్రేన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్. ఈ కంపెనీ సహ వ్యవస్థాపకుడే మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాకు చెందిన ఒక రైతు కొడుకుకు లలిత్ కేష్రే. ఆయన కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Siddaramaiah: ‘‘మీకు అడగటానికి వేరే ప్రశ్నలే లేవా.?’’ మీడియాపై సీఎం ఆగ్రహం..

దేశంలో అత్యధిక సంఖ్యలో యాక్టివ్ యూజర్లు (11.9 మిలియన్లు) ఉన్న ప్లాట్‌ఫామ్ గ్రోవ్. ఈ సంస్థ మార్కెట్ విలువ రూ.70 వేల కోట్లు అని అంచనా. ఈ విజయంలో కంపెనీ సహ వ్యవస్థాపకుడు, CEO లలిత్ కేష్రే ప్రధాన పాత్ర పోషించారు. హర్ష్ జైన్, నీరజ్ సింగ్, ఇషాన్ బన్సాల్‌లతో కలిసి లలిత్ కేష్రే గ్రోవ్‌ను స్థాపించారు. లలిత్ మొదటి స్టార్టప్ విఫలమైంది. దీంతో ఆయనకు అప్పులు మిగిలిపోయాయి. వాటిని తీర్చడానికి ఆయన ఫ్లిప్‌కార్ట్‌లో పని చేయాల్సి వచ్చింది. అలా వచ్చిన డబ్బులతో చేసిన అప్పును తీర్చాడు. ఈ మంగళవారం గ్రోవ్ కంపెనీ స్టాక్ మార్కెట్‌లో రూ.6,632 కోట్ల ఐపీఓను ప్రారంభిస్తోంది.

ఒక ఆలోచన జీవితాన్ని మార్చింది..
షేర్లు కొనడానికి అవసరమైన కాగితపు పని, సుదీర్ఘమైన ప్రక్రియ తనను కలవరపెట్టాయని చెప్పాడు లలిత్. ఈ ప్రక్రియకు భిన్నంగా ఉండేది ఏదైనా ఉంటే బాగుండు అనుకొన్నానని చెప్పాడు. ఒక ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌కు షేర్లు కొనడం అంత కష్టంగా ఉంటే, సగటు వ్యక్తికి అది ఎంత కష్టంగా ఉంటుందో అని ఆలోచించినట్లు తెలిపాడు. ఈ ఆలోచన నుంచి పుట్టిందే ‘గ్రోవ్’ అనే ఆన్‌లైన్ కంపెనీ. ఇప్పుడు ఈ కంపెనీ లక్షలాది మంది భారతీయులకు సులభంగా షేర్లు కొనడానికి సహాయపడుతుంది.

మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లాలో లలిత్ జన్మించాడు. అతను తెలివైన విద్యార్థి, కోచింగ్ లేకుండానే JEE పాసయ్యాడు. అనంతరం IIT బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో చేరాడు. కళాశాల తర్వాత ఆయన కొన్ని సంవత్సరాలు పలు కంపెనీలలో పనిచేశాడు. అనంతరం 2011లో తన మొదటి స్టార్టప్ “ఎడుఫ్లిక్స్”ను ప్రారంభించాడు. ఆ సమయంలో ఇంటర్నెట్ ఖరీదైనదిగా, అలాగే పరిమితంగా ఉండేది. దీంతో ఆయన పెన్ డ్రైవ్‌లు, మెమరీ కార్డులలో కోర్సు సామగ్రిని అమ్మాడు. కానీ ఆయన స్టార్టప్ విఫలమైంది. అయినా లలిత్ తన పట్టుదలను వదులుకోలేదు. చేసిన అప్పులను ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగం సంపాదించి తేర్చాడు.

2016 గ్రో పునాది..
2016లో ఫ్లిప్‌కార్ట్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నప్పుడు లలిత్‌కు తన వ్యాపార ఆలోచన గ్రో కోసం నమ్మకమైన భాగస్వామి అవసరం ఏర్పడింది. ఒకరోజు ఆయన తను పని చేసే కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా ఉన్న హర్ష్ జైన్‌ను తన సొంత కంపెనీలో పని చేయడానికి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ చేశాడు.

వాస్తవానికి లలిత్‌కు హర్ష్ చాలా కాలంగా తెలిసిన స్నేహితుడు. అందుకే ఆయన హర్ష్‌ను తన స్టార్టప్‌లో చేరమని అడిగాడని చెప్పారు. అనంతరం నీరజ్ సింగ్, ఇషాన్ బన్సాల్ తమ బృందంలో చేరారని లలిత్ చెప్పారు. తామందరం కలిసి గ్రోవ్ అనే షేర్ మార్కెట్ పెట్టుబడి వేదికను ప్రారంభించినట్లు లలిత్ వెల్లడించారు. అలా ప్రారంభమైన ఈ సంస్థ నేడు 11.9 మిలియన్లకు పైగా క్రియాశీల వినియోగదారులతో భారతదేశంలో నంబర్ వన్ ఆన్‌లైన్ బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్‌గా రికార్డు సొంతం చేసుకుంది.

అప్పుల నుంచి రూ.26 వేల కోట్ల ఆస్తుల వరకు..
నేడు లలిత్ కేష్రే నికర విలువ రూ.26 వేల కోట్లు అని అంచనా. ఆయన గ్రో కంపెనీ ఈ మంగళవారం స్టాక్ మార్కెట్‌లో ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)ను రాబోతుంది. ఈ ఐపీఓ మొత్తం విలువ రూ.6,632 కోట్లు. ఇటీవల ఆయన టైమ్ మ్యాగజైన్ “100 నెక్స్ట్ 25” జాబితాలో కూడా చేర్చారు. నేటికీ కూడా లలిత్ కస్టమర్ ఫిర్యాదులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తాడని సమాచారం. ఈ కస్టమర్-కేంద్రీకృత విధానం గ్రో గొప్ప బలం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఒక సాధారణ రైతు కొడుకు విజయగాథ. ప్రారంభంలో ఎదురైన సవాళ్లకు భయపడకుండా, తను నమ్మిన మార్గంలో చివరి వరకు ప్రయాణించి విజయాన్ని సాధించాడు లలిత్.

READ ALSO: Amol Muzumdar: మహిళల వన్డే ప్రపంచ కప్ నిజమైన ఛాంపియన్.. ఈయనే !

Exit mobile version