Site icon NTV Telugu

Elon Musk: టెస్లా వ్యవస్థాపకుడి షాకింగ్‌ నిర్ణయం

టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్‌ మస్క్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. ఎండీవర్‌ గ్రూప్స్‌ హోల్డింగ్స్‌ సంస్థ డైరక్టర్ల బోర్డుకు రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేఛేంజ్‌ కమిషన్‌కి ఎలన్‌ మస్క్‌ నిష్క్రమణ గురించి ఎండీవర్‌ గ్రూప్స్‌ హోల్డింగ్స్‌ తెలిపింది. ఈ ఏడాది జూన్ తర్వాత మస్క్‌ డైరక్టర్ల బోర్డులో ఉండబోరని తెలిపింది. అమెరికాకు చెందిన ఎండీవర్‌ గ్రూప్స్‌ హోల్డింగ్స్‌ మీడియా, హాలీవుడ్‌, మార్కెటింగ్‌ విభాగాల్లో భారీ ఆదరణను పొందింది. అనుబంధ సంస్థల ద్వారా వినోద కంటెంట్‌ను అందిస్తోంది. మార్కెటింగ్, లైసెన్సింగ్, ప్రాతినిధ్యం, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో సైతం ప్రత్యేకతను చాటుకుంది. ఈ కంపెనీలో విలియం మోరిస్ టాలెంట్ ఏజెన్సీ, అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్‌ కంపెనీలు సబ్సీడరీలుగా ఉన్నాయి.

Read Also: Holi 2022: హోలీ సందడి.. రంగుల పండుగ సెలబ్రేషన్స్..

Exit mobile version