Pranava One: హైదరాబాద్ మహానగరంలో నిర్మాణ రంగం ఎప్పటికప్పుడు రూటు మారుస్తూనే ఉంది.. ఇండిపెండెంట్‌హౌస్‌లు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు.. అంతెందుకు నగరం నడి బొడ్డులోనే సరికొత్త గేటెడ్ కమ్యూనిటీలు.. ఇలా ఎన్నో మార్పులు సంతరించుకుంటున్నాయి.. ఇక, నిర్మాణ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ప్రణవ గ్రూప్.. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త అనుభూతిని కలిగించేలా నిర్మాణాలు చేపడుతోంది. ప్రణవ వినియోగదారులను మంత్రముగ్ధులను చేసేలా అత్యాధునిక నివాస, వాణిజ్య నిర్మాణాలను అందిస్తోంది. రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ల నుంచి భారీ స్థాయి వాణిజ్య టవర్‌ల వరకు అనే ప్రాజెక్టులు చేపట్టి జీరో కాంప్రమైజ్‌లతో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ ప్రణవ గ్రూప్ విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తోంది. ప్రణవ గ్రూప్ నాణ్యమైన నిర్మాణాన్ని అందించడంతో పాటు సమయానుకూలంగా నిర్మాణాలను వినియోగదారులకు అందజేయడంతో పాటు వినూత్న డిజైన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
ఎకో లగ్జరీ అనే కాన్సెప్ట్‌తో..
హైదరాబాద్ నగరం నడిబొడ్డున సోమాజిగూడలో ప్రణవ వన్ పేరుతో గ్రౌండ్ ఫ్లోర్‌తో కలిపి 19 అంతస్థుల అందమైన భవనం రూపుదిద్దుకుంది. ఎకో లగ్జరీ అనే కాన్సెప్ట్‌తో వస్తున్న సంస్థ ప్రణవ వన్ హైదరాబాద్. హార్ట్ ఆఫ్ ద సిటీ అనే చెప్పుకునే సోమాజిగూడలో 4 బీహెచ్‌కే లగ్జరీ అపార్ట్‌మెంట్లను నిర్మించింది. దాదాపు 10 లక్షల 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. నాలుగున్నర ఎకరాలలో రెండు టవర్లు నిర్మిస్తున్న ప్రణవ గ్రూప్ మొత్తం 140 యూనిట్లను నిర్మించింది. ఒక్కో ఫ్లాట్‌ను 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు. సోమాజిగూడలో ప్రణవ వన్ నిర్మించిన ప్రాజెక్టులో కేవలం 29 శాతం మాత్రమే కన్‌స్ట్రక్షన్ పార్ట్ కాగా.. మిగతా 71 శాతం ఓపెన్ స్పేస్‌తో పాటు గ్రీనరీ ఉంటుంది. పైగా ఓపెన్ కమ్యూనిటీ ఫార్మింగ్ ల్యాండ్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది. ఈ కాన్సెప్ట్ మరో ఇతర ప్రాజెక్ట్‌లో కూడా లేదు. ప్రాజెక్టులోని గోడలను కూడా మట్టి, బురద ఇటుకలతో నిర్మించారు. దీనివల్ల ఉష్ణోగ్రత భారీగా తగ్గుతుంది. ఈ బిల్డింగ్‌కు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్లాటినం రేటింగ్ ఉంది. పవర్ బ్యాకప్ ఫెసిలిటీ, రెగ్యులర్ వాటర్ సప్లైతో ప్రాజెక్టు నిర్మాణం జరిగింది.
సోమాజిగూడలో ప్రాజెక్టు అంటే సరిగ్గా సిటీ మధ్యలో ఉన్నట్టే. అంటే అన్ని అందుబాటులో ఉంటాయి. ప్రణవ వన్ హైదరాబాద్ మధ్యలో అన్నింటికి సౌకర్యవంతంగా ఉండడంతో పాటు నగరంలోని స్కూల్స్, వినోద ప్రదేశాలు, మాల్స్, ఆస్పత్రులు, ఇతర ప్రముఖ ప్రాంతాలకు సమీపంలో ఉంది. రవాణాపరంగా సోమాజిగూడకు ప్రత్యేక ప్రయోజనం ఉంది. ఎర్రమంజిల్ మెట్రోస్టేషన్‌కు కేవలం పది నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. విద్యా సంస్థలతో పాటు ఆస్పత్రులకు అతి దగ్గరలో నిర్మించబడింది ఈ ప్రాజెక్ట్. వివేకానంద స్కూల్, మౌంట్ హెలికాన్ పబ్లి్క్ స్కూల్, టైమ్ కిడ్స్‌ప్రీ స్కూల్, యశోద హాస్పిటల్స్, నిమ్స్, ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ, దగ్గరలో ఉన్నాయి. వినియోగదారుల సంతృప్తే లక్ష్యంగా నిర్మాణం జరిగింది. ఇందులో ఏరోబిక్స్ రూమ్,గెస్ట్ రూమ్, లైబ్రరీ, ఫస్ట్ ఎయిడ్ సెంటర్, ఫూస్ బాల్, టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్, క్యారమ్స్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టులు, జిమ్,బాంకెట్ హాల్, బార్బెక్ పిట్, యూనిసెక్స్ సెలూన్, మినీ థియేటర్, రూఫ్ టాప్, ఇన్ఫినిటీ పూల్ వంటి అధునాతన సౌకర్యాలను వినియోగదారుల కోసం కల్పిస్తున్నారు.