NTV Telugu Site icon

Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలపై ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్! పెట్రోల్ ధర ఎకంగా రూ.250?

Petrol

Petrol

పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం తగ్గించే అవకాశం ఉందని గత వారం వార్తలు వచ్చాయి. ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణం. దీంతోపాటు చమురు కంపెనీలు కూడా లాభపడ్డాయి. పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చమురు ధరలను లీటరుకు రూ.2 నుంచి 3 వరకు తగ్గించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణం..
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ముడి చమురు ధర మళ్లీ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో చౌకగా పెట్రోల్, డీజిల్ ఆశకు ఎదురుదెబ్బ తగలవచ్చు. ఓ జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. ముడి చమురు ధర బ్యారెల్కు $ 200 వరకు ఉంది. ఇదే జరిగితే భారత్‌లో పెట్రోలు ధర లీటరుకు రూ.250 వరకు పెరగవచ్చు. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95గా ఉంది.

ముడి చమురు ధర ఎంత అయింది?
ప్రస్తుతం ముడి చమురు ధర బ్యారెల్‌కు 75 డాలర్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంది. దీని ధర ఒక్కరోజులో దాదాపు 3 శాతం పెరిగింది. గత వారం దాని ధర బ్యారెల్‌కు దాదాపు $68గా ఉంది. అటువంటి పరిస్థితిలో, దాని ధర కేవలం ఒక నెలలో $ 7 పెరిగింది, ఇది 10 శాతం కంటే ఎక్కువ.

ధర మరింత పెరిగే అవకాశం ఉంది..
చమురు మార్కెట్లో ఇరాన్ ప్రధాన దేశం. ఇరాన్ రోజుకు 4 మిలియన్ బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ ప్రకారం.. ఇరాన్ చమురు నిల్వలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటే ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 4 శాతం ప్రమాదంలో పడవచ్చు. అటువంటి పరిస్థితిలో.. చమురు ధరలు బ్యారెల్కు $ 20 వరకు పెరగవచ్చు.

పెట్రోల్ లీటర్ రూ.250కి దొరుకుతుంది!
కొన్ని నివేదికల ప్రకారం.. ఇరాన్ చమురు నిల్వలపై ఇజ్రాయెల్ దాడి చేసి నాశనం చేస్తే, ముడి చమురు ధర బ్యారెల్కు $ 100 దాటవచ్చు. స్వీడిష్ బ్యాంక్ ఎస్‌ఈబీ నివేదిక ప్రకారం.. ఇది జరిగితే, ముడి చమురు ధర బ్యారెల్‌కు $ 200 కి చేరుకోవచ్చు. కేడియా కమోడిటీ ఎమ్‌డీ అజయ్ కేడియా ప్రకారం, ఇది జరిగితే భారతదేశంలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 250 వరకు పెరగవచ్చు.

చమురు కంపెనీలకు భారీ లాభాలు..
దేశంలోని మూడు ప్రధాన చమురు కంపెనీలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.81 వేల కోట్లు ఆర్జించాయి. ఇందులో ఇండియన్ ఆయిల్ అత్యధికంగా లాభపడింది. ఇండియన్ ఆయిల్ దాదాపు రూ.40 వేల కోట్లు సంపాధించింది. భారత్ పెట్రోలియం రూ.26.67 వేల కోట్లు, హిందుస్థాన్ పెట్రోలియం దాదాపు రూ.14.70 వేల కోట్లు ఆర్జించాయి.