NTV Telugu Site icon

Magni5: ఘనంగా కాగ్నిటోనిక్‌ సిస్టమ్స్‌ ఐదో వార్షికోత్సవ వేడుకలు

1

1

హైదరాబాద్‌కు చెందిన ఐటీ స్టార్టప్‌ కంపెనీ కాగ్నిటోనిక్‌ సిస్టమ్స్‌ ( Cognitonic Systems) తన ఐదవ వార్షికోత్సవాన్ని magni5 పేరుతో ఎంతో ఉత్సాహభరితమైన వాతావరణంలో ఇటీవల జరుపుకుంది. డిజిటల్‌ టెక్నాలజీ సేవలు అందించడంలో ముందంజలో ఉండే కాగ్నిటోనిక్‌ సిస్టమ్స్‌ బిపిఎం (BPM), సిఆర్‌ఎం (CRM), కేస్‌ మేనేజ్‌మెంట్, రోబోటిక్, డెసిషనింగ్‌ సొల్యూషన్స్‌ తదితర అంశాలలో తన వినియోగదారులను ప్రభావవంతంగా నడిపిస్తూ డిజిటల్‌ జర్నీలో ముందుకు సాగుతోంది.

2018లో ప్రారంభించబడిన ,కాగ్నిటోనిక్‌ సిస్టమ్స్‌ సంస్థ తన ఖాతాదారులకు ప్రభావవంతమైన డిజిటల్‌ ప్రయాణంలో మార్గనిర్దేశం చేస్తుంది. ఈ సంస్థ భారతదేశంతోపాటు, ఆస్ట్రేలియా మరియు అమెరికాలో వినియోగదారులకు సేవలు అందిస్తూ కార్యాలయాలు కలిగి ఉంది. సంస్థ విజయ ప్రయాణంలో ప్రతిభావంతులైన, అసాధారణ ప్రతిభ కలిగిన employees కృషిని గుర్తించి, ప్రశంసించే వేదికగా magni5 నిలచింది.

కార్యక్రమంలో సంస్థ CEO, వ్యవస్థాపకులు శ్రీ ముఖేష్‌ కుమార్‌ మాట్లాడుతూ స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంపొందించే ఉద్దేశంతో పనిచేస్తున్న విధానాన్ని వివరించారు. హైదరాబాద్‌ కేంద్రాన్ని బలపేతం చేయడం, విభిన్న సేవలను అందించడం, వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడం తదితర ప్రణాళికలను వివరించారు. సంస్థ , భవిష్యత్తు కోసం ఉత్తేజకరమైన ప్రణాళికలను వేదికపై ఆవిష్కరించారు.భవిష్యత్‌ కాలంలో రాబోయే సవాళ్లను, అవకాశాలను ఉత్సాహంతో స్వీకరిస్తూ ముందుకు సాగుతామని చెప్పారు.

టెక్నాలజీ, సేల్స్‌ విభాగాధిపతి రేవంత్‌ రావూరి మాట్లాడుతూ వైవిధ్యమైన సాకేంతిక అంశాలలో సంస్థ అడుగిడి, ప్రగతి సాధిస్తున్న విధానం, సంస్థ వ్యూహాత్మక ముందడుగు, మార్పులను వివరించారు. అవధులు లేని ఆవిష్కరణలకు స్థానం కల్పిస్తూ తమ ఖాతాదారులకు విలువైన సేవలను అందించడంతో పాటు డిజిటల్‌ పరివర్తనంలో (digital transformation) భాగస్వాములను చేయడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న విధానం తెలియజేశారు. ఈ దిశగా సంస్థ కీలకభూమిక పోషిస్తున్న విధానం వివరించారు.

డెలివరీ, ఆపరేషన్స్‌ విభాగాధిపతి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమ రూపకల్పనలో భాగస్వాములైన ప్రతీ ఒక్కరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ, కృతజ్ఞతుల తెలిపారు. సంస్థ పనితీరులో, ప్రగతిలో సంపూర్ణ సహకారం అందిస్తున్న వాటాదారులు, సమిష్టిగా, సమన్వయంతో పనిచేస్తున్న సంస్థసిబ్బంది, తమపై నమ్మకం ఉంచిన క్లయింట్లు, వాటాదారుల అచంచల విశ్వాసం తమకు కొత్త శక్తిని ఇస్తూ మున్ముందుకు నడిపిస్తున్నాయన్నారు.

సంస్థసామాజిక బాధ్యతలో భాగంగా కోవిడ్‌ 19 మహమ్మారి ప్రబలిన సందర్భంలో ఆక్సిజన్‌ పంపిణీ చేసిన విధానం, తరువాతి కాలంలో వృద్దులు, అనాధ శరణాలయాలకు అందిస్తున్న సేవ, సహాయం భవిష్యత్తు కాలంలో మరింత పెంపుదల చేస్తూ కొనసాగించడం జరుగుతుందన్నారు. డిజిటల్‌ వ్యవస్థలలో కాగ్నిటోనిక్‌ సిస్టమ్స్‌ కొత్త ఆవిష్కరణలు చేయడం, ఉత్తమ కస్టమర్‌ సేవలను అందిస్తూ, ఉద్యోగుల జీవితాలను మరింత సుసంపన్నం చేయడంపై దృష్టి సారిస్తుంది అని చెప్పారు. కాగ్నిటోనిక్‌ సిస్టమ్స్‌ భవిష్యత్తులో మరిన్ని అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా కోరుకుందాం!