Chegg Downfall: ఒకప్పుడు ఎడ్‌టెక్ రారాజు.. నేడు దివాళా దిశగా! ఏఐ దెబ్బకు 15 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం క్లోజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chegg Downfall: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన సునామీలో ఒకప్పటి దిగ్గజ ఎడ్‌టెక్ (EdTech) సంస్థ ‘చెగ్’ (Chegg) కుప్పకూలుతోంది. విద్యార్థుల పాలిట పెన్నిధిలా ఉన్న ఈ కంపెనీ, ఇప్పుడు చాట్ జీపీటీ దెబ్బకు కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. ఒకప్పుడు అమెరికన్ విద్యార్థులకి హోంవర్క్ చేయాలన్నా, క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు కావాలన్నా గుర్తొచ్చే మొదటి పేరు ‘చెగ్’ (Chegg). కానీ, కాలం మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ఈ ఎడ్‌టెక్ దిగ్గజాన్ని దివాళా తీసే స్థాయికి తీసుకొచ్చాయి. కేవలం నాలుగేళ్లలోనే ఈ కంపెనీ విలువ దాదాపు సున్నాకి పడిపోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక కేస్ స్టడీగా మారింది. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
శిఖరాగ్రం నుంచి పాతాళానికి..
2021 ప్రాంతంలో చెగ్ కంపెనీ గొప్ప స్థాయిలో ఉంది. అప్పట్లో దీని మార్కెట్ విలువ సుమారు 15 బిలియన్ డాలర్లు (రూ.1.25 లక్షల కోట్ల పైమాటే). లక్షలాది మంది విద్యార్థులు సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించి మరీ ఈ ప్లాట్‌ఫారమ్‌లో సమాధానాలు వెతుక్కునేవారు. అయితే 2022లో చాట్ జీపీటీ రాకతో సీన్ మొత్తం రివర్స్ అయింది. చెగ్ లో సమాధానం కావాలంటే డబ్బు కట్టాలి, వెయిట్ చేయాలి. కానీ చాట్ జీపీటీ అదే సమాధానాన్ని ఉచితంగా, కొన్ని సెకన్లలోనే అందించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఫ్రీగా సమాధానాలు దొరకడం మొదలైందో, అప్పుడు విద్యార్థులు చెగ్ సబ్‌స్క్రిప్షన్‌లను క్యాన్సల్ చేసుకోవడం ప్రారంభించారు. దీంతో కంపెనీ ఆదాయం గతంలో ఎన్నడూ లేనంత ఘోరంగా పడిపోయింది.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
గూగుల్ AI Overviewతో కోలుకోలేని దెబ్బ..
కేవలం చాట్ జీపీటీ మాత్రమే కాకుండా, గూగుల్ ప్రవేశపెట్టిన ‘AI Overview’ ఫీచర్ చెగ్ పాలిట శాపంగా మారింది. గతంలో విద్యార్థులు గూగుల్ సెర్చ్ ద్వారా చెగ్ వెబ్‌సైట్‌లోకి వచ్చేవారు. కానీ ఇప్పుడు గూగుల్ స్వయంగా ఏఐ ద్వారా సమాధానాన్ని సెర్చ్ రిజల్ట్ పేజీలోనే చూపిస్తోంది. దీంతో చెగ్ వెబ్‌సైట్‌కు వచ్చే ట్రాఫిక్ పూర్తిగా పడిపోయింది. ప్రస్తుతం ఈ కంపెనీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. 2025 నాటికి కంపెనీ ఆదాయంలో 40-50 శాతం కోత పడింది. దీంతో ఖర్చులు తగ్గించుకోవడానికి వేలాది మంది ఉద్యోగులను చెగ్ ఇంటికి పంపించేసింది. ఇదే సమయంలో మార్కెట్లో కంపెనీ షేర్లు ఒక్కసారిగా 40-50 శాతం పడిపోవడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోయారు.
చెగ్ చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే.. తన వ్యాపార నమూనాను కేవలం ‘హోంవర్క్ హెల్ప్’ అనే అంశంపైనే ఆధారపడేలా చేసుకోవడం. ఏఐ సాంకేతికతకు అనుగుణంగా తనను తాను త్వరగా మార్చుకోలేకపోవడమే ఈ పతనానికి ప్రధాన కారణం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సమాచారం ఎప్పుడైతే ఉచితంగా, తక్షణమే లభిస్తుందో.. అప్పుడు దాన్ని అమ్మే వ్యాపారాలు మనుగడ సాగించడం కష్టమని ‘చెగ్’ ఉదాహరణ నిరూపిస్తోంది.
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి