Site icon NTV Telugu

Paytm LPG Offers: శుభవార్త.. ఇలా చేస్తే గ్యాస్‌ బుకింగ్‌పై రూ.1000 క్యాష్‌ బ్యాక్

Paytm Lpg Offers

Paytm Lpg Offers

క్రమంగా పెరిగిపోయిన గ్యాస్‌ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.. అంతర్జాతీయ చమురు ధరల ఎఫెక్ట్‌తో భారత్‌లో పెట్రో ధరలతో పాటు.. గ్యాస్‌ ధరలను కూడా వడ్డించాయి చమురు సంస్థలు.. ఇక, ప్రతీ నెల గ్యాస్‌ రేట్లను మార్పు కనిపిస్తూనే ఉంది.. అయితే, గ్యాస్‌ సిలిండ్‌ బుక్‌ చేసేవారికి గుడ్‌న్యూస్‌ చెప్పింది ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం.. సిలిండర్‌ బుకింగ్స్‌పై పలు రకాల ఆఫర్లను తీసుకొచ్చింది.. ఈ యాప్‌ను ఉపయోగించి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే.. క్యాష్‌ బ్యాక్‌ సహా నాలుగు రకాల ఆఫర్లను తీసుకొచ్చింది పేటీఎం.

Read Also: Flipkart Big Saving Days sale: బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్.. 80 శాతం వరకు డిస్కౌంట్‌..!

ఇక, పేటీఎంలో ఈ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ ఎలా పొందాలంటే.. మొదటి క్యాష్‌బ్యాక్ ఆఫర్ కోసం ప్రోమోకోడ్ GAS1000 వినియోగించాలి.. ఈ ప్రోమోకోడ్‌ని ఉపయోగించి కస్టమర్ రూ.5 నుంచి రూ.1000 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది.. అంటే.. రూ. 5 నుంచి వెయ్యి రూపాయల మధ్య ఎంతైనా క్యాష్‌బ్యాక్‌ రావొచ్చన్నమాట.. ఇక, FREEGAS ప్రోమోకోడ్‌తో గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకున్న ప్రతి 500వ వినియోగదారునికి వెయ్యి రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ అందుకునే అవకాశం ఉంది.. మరోవైపు ఏయూ క్రెడిట్ కార్డ్‌తోనూ సిలిండర్‌ చెల్లింపుపై పేటీఎం రూ.50 వరకు తగ్గింపును అందిస్తోంది.. ఈ ఆఫర్ ప్రోమోకోడ్ AUCC50… ఇక, యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో గ్యాస్ సిలిండర్‌ చెల్లింపుపై రూ.30 తగ్గింపు లభించనుంది.. దీని కోసం గ్యాస్‌ బుకింగ్ చేసే సమయంలో GASYESCC ప్రోమోకోడ్‌ను వాడాల్సి ఉంటుంది.. మొత్తంగా గ్యాస్‌ ధరలు వంటిట్లో మంటపెడుతోన్న వేళ.. పేటీఎం ఆఫర్‌ … కొంత మంది వినియోగదారులకు ఉపశమనం కలిగించనుంది.

Exit mobile version