NTV Telugu Site icon

Apple Watch: ‘ఆపిల్ వాచ్’ వాడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

Apple Watch

Apple Watch

central government warning to apple watch users: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆపిల్ స్మార్ట్ వాచ్ వాడుతున్నారు. హెల్త్ మానిటరింగ్‌కు సంబంధించి ఆపిల్ వాచ్ ఎంతో ఉపయోగపడుతోంది. అందుకే ఎంతో మంది నెటిజన్‌లు తమ ప్రాణాలను ఆపిల్ వాచ్ కాపాడిందంటూ సోషల్ మీడియాలో పలు మార్లు కథనాలను పోస్ట్ చేయడం మనం చూసే ఉంటాం. అందుకే ఆపిల్ వాచీని వాడేందుకు యూజర్లు ఎంతో ఇష్టపడుతున్నారు. అయితే తాజాగా ఆపిల్ వాచ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆపిల్ వాచీలలో వినియోగించే వాచ్ ఓఎస్‌లో అనేక లోపాలు ఉన్నాయని కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా 8.7కి ముందు వెర్షన్ ఓఎస్‌లు వాడేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Read Also: NACS: సైబర్ సెక్యూరిటీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

ఆపిల్ వాచీలోని లొసుగుల సాయంతో హ్యాకర్లు వాచ్‌లోకి చొరబడి ఆర్బిట్రేటరీ కోడ్ రన్ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా సెక్యూరిటీ వ్యవస్థలను బైపాస్ చేసి స్మార్ట్ వాచ్‌ను తమ అధీనంలోకి తెచ్చుకోగలరని కేంద్రం పేర్కొంది. ఆపిల్ వాచ్ ఓఎస్ పాత వెర్షన్లు వాడుతున్న వారు సైబర్ దాడుల నుంచి తప్పించుకునేందుకు వెంటనే కొత్త వెర్షన్ కు అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. ఆపిల్ నుంచి సెక్యూరిటీ ప్యాచెస్ కోరాలని హితవు పలికింది. ఈ మేరకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ) కీలక విషయాలను బహిర్గతం చేసింది. ఆపిల్ వాచ్ 8.7కు ముందు పాత ఓఎస్‌లు వాడుతున్న వారు అత్యంత తీవ్ర ముప్పు ముంగిట ఉన్నట్టేనని సీఈఆర్టీ తెలిపింది. అటు ఆపిల్ కూడా వాచ్ ఓఎస్ 8.7ను రిస్క్ తో కూడిన వెర్షన్‌గా పేర్కొనడం గమనార్హం.

Show comments