NTV Telugu Site icon

State Bank Of india: ఎస్‌బీఐ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

State Bank Of India

State Bank Of India

భారత్‌లోని ప్రభుత్వ రంగ బ్యాంకులలో అతి పెద్ద సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ప్రస్తుతం ఎస్‌బీఐ కస్టమర్ల ఫోన్‌లకు ఓ ఫేక్ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది. మీ ఎస్‌బీఐ ఖాతాను బ్లాక్ చేశారని.. సంబంధిత వివరాలతో మళ్లీ మీ ఖాతాను పునరుద్ధరించుకోవాలని మెసేజ్‌తో పాటు ఓ లింకు కూడా దర్శనమిస్తోంది. ఈ మెసేజ్‌ కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఇది ఫేక్ మెసేజ్ అని.. ఈ మెసేజ్ పట్ల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగంహెచ్చరించింది.

Rich Persons List: బ్రిటన్‌ శ్రీమంతుల జాబితాలో భారతీయులు

ఎస్‌బీఐ తన ఖాతాదారులకు ఎప్పుడూ ఇలాంటి సందేశాలు పంపదని, ఒకవేళ మీ ఫోన్లకు, మెయిల్‌కు ఇలాంటి సందేశాలు వస్తే అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకు ఖాతా వివరాలను పంచుకోవద్దని హెచ్చరించింది. ఈ ఫేక్ మెసేజ్‌ను ఎవరైనా ఎస్‌బీఐ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటే report.phishing@sbi.co.in కు మెయిల్ చేయాలని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం పేర్కొంది. అంతేకాకుండా సబ్ కా వికాస్ మహా క్విజ్ పేరుతో కూడా ఓ లింక్ సర్క్యులేట్ అవుతోందని.. దీనిని కూడా నమ్మవద్దని కేంద్ర సమాచార ప్రసార శాఖ హితవు పలికింది.