Site icon NTV Telugu

Central Bank of India: కేంద్రం కీలక నిర్ణయం.. మూతపడనున్న 600 బ్రాంచీలు

Central Bank Of India Min

Central Bank Of India Min

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా పలు శాఖలను మూసివేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. కొన్నేళ్లు ఈ బ్యాంక్ ఒడిదొడుకులకు లోను కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 13 శాతం బ్రాంచీలు అంటే దేశవ్యాప్తంగా సుమారు 600 బ్రాంచీలు మూతపడే అవకాశాలున్నాయి.

ఒకవేళ శాఖలను మూసివేయడం కుదరని పక్షంలో నష్టాల్లో ఉన్న శాఖలను ఇతర శాఖలలో విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. వ‌చ్చే ఏడాది మార్చి నాటికి శాఖ‌ల కుదింపు నిర్ణయం అమ‌ల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆర్థిక స్థితిగ‌తుల‌ను మెరుగు ప‌రిచేందుకు నాన్‌కోర్ అసెట్స్, ఇళ్ల స్థలాలు వంటి ఆస్తులను విక్రయించాల‌ని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,594 శాఖ‌లు ఉన్నాయి. 2017లో ఆర్బీఐ రూపొందించిన మార్గద‌ర్శకాల‌ను కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉల్లంఘించాయ‌ని వార్తలు రాగా.. వాటిలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉందని ఆరోపణలు వినిపించాయి.

RBI: వడ్డీ రేట్లను పెంచిన ఆర్బీఐ.. కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు..!

Exit mobile version