Business Ideas: పండగ సీజన్ లో భారీ ఆదాయాన్ని అందించే వ్యాపారాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిజినెస్ చెయ్యాలనే కోరిక అందరికీ ఉంటుంది.. అలాంటివారికి ఇది మంచి సమయం.. ఈరోజుల్లో పండగ సీజన్ రావడంతో జనాలు కొత్త వస్తువులు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అప్పుడే మనదేశంలో పండగల సందడి అప్పుడే మొదలై పోయింది.. దసరా, దీపావళి పండుగలు సంప్రదాయాలను, సంతోషాలను మాత్రమే కాదు..ఆర్థిక అవకాశాలను కూడా అందజేస్తాయి. ఈ పండుగలు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయి. ఈ సమయంలో మంచి లాభాలను తీసుకొచ్చే కొన్ని బిజినెస్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పూల వ్యాపారం..
Also Read
- Diwali Special Trading: దీపావళి వేళ ప్రత్యేక ట్రేడింగ్.. లాభాలతో మొదలై నష్టాలతో ముగిసిన సూచీలు..
- Temple Device: జొమాటో కొత్త బిజినెస్ స్కీమ్.. మండిపడుతున్న డాక్టర్లు!
- Ananya Agarwal: 21 ఏళ్ల వయసులోనే బిజినెస్.. కేవలం 50 రోజుల్లోనే రూ. 15 లక్షల రెవెన్యూ రాబట్టిన కాలేజీ స్టూడెంట్
- SEBI New Rules: మ్యూచువల్ ఫండ్స్‌లో భారీ మార్పు.. ఏప్రిల్ 1, 2027 నుంచి కొత్త సెటిల్మెంట్ రూల్స్..!
పండుగలలో ముఖ్యంగా పూజల కోసం పూలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పూల దండలు, పుష్పగుచ్ఛాలు, వివిధ రకాల ఆకులను పూజ కోసం విక్రయించడానికి తాత్కాలిక పూల దుకాణాన్ని ఏర్పాటు చేయవచ్చు. మంచి లాభాలను అందుకోవచ్చు..
బట్టల దుకాణం..
పండుగకు వెళ్లేవారు కొత్త బట్టలు కొనడానికి ఇష్టపడతారు. బట్టల దుకాణాన్ని ఓపెన్ చేసి, పండుగ ప్రారంభానికి ముందే వస్తువులను అమ్మడం ప్రారంభించవచ్చు. ఫెస్టివల్ సీజన్ కావున ప్రతి కుటుంబం కొత్త బట్టలను కొనుగోలు చేస్తారు..
విగ్రహాల అమ్మకం..
దసరా, దీపావళి పండుగలకు పూజల కోసం దేవతా మూర్తుల విగ్రహాలను కొనుగోలు చేస్తారు. అందుకే ఈ పండుగల సమయంలో విగ్రహాల తయారీ, విక్రయ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు… ఇది మంచి లాభాలను తెచ్చిపెడుతుంది..
స్వీట్స్ షాప్..
స్వీట్లు లేకుండా దసరా, దీపావళి, దుర్గాపూజ పూర్తి కాదు. అందుకే ఈ సీజన్లో బిజీ స్ట్రీట్స్‌లో మిఠాయిలు తయారు చేయడం, విక్రయించడం ప్రారంభించండి. లడ్డూలు, జిలేబీలు, రసగుల్లాలు, గులాబ్ జామూన్లు వంటి ట్రీట్లను ఆఫర్ చేయండి. వీటి ధర కేజీ రూ.200 నుంచి రూ.1,000 మధ్య ఉంటుంది.. పండగలకు ఎక్కువగా స్వీట్స్ కొంటారు.. మంచి లాభాలను అందుకోవచ్చు..
అలంకరణ వస్తువులు..
పండుగ సమయంలో గృహాలంకరణకు చాలా డిమాండ్ ఉంటుంది. అందుకే ఇళ్లు, బాల్కనీలు, ప్రాంగణాలను అలంకరించేందుకు రంగురంగుల లైట్లు, గోడ గడియారాలు, ఫోటో ఫ్రేమ్‌లు, క్యాండిల్ స్టాండ్లు, షోపీస్‌లు, ల్యాంప్షేడ్లు మొదలగు వస్తువులకు మంచి డిమాండ్ ఉంటుంది..
మెహందీ షాప్..
పండుగలకు మెహందీని ఎక్కువగా పెట్టుకుంటారు.. మెహందీ డిజైన్ దుకాణాన్ని ఓపెన్ చేయడం ద్వారా పండుగకు వెళ్లేవారిని, ముఖ్యంగా మహిళలను ఆకర్షించవచ్చు..
ఫుడ్ స్టాల్స్..
సాంప్రదాయ వంటకాల పట్ల ఉన్న ప్రేమ ఈ పండుగలలో అంతర్భాగం. ఆలయాలు, ఇతర రద్దీ ప్రాంతాల వద్ద ఫుడ్ స్టాల్‌ను ఏర్పాటు చేయడం మంచి ఆలోచన. బిర్యానీ, సమోసాలు, చాట్, పానీపూరీ, చైనీస్ ఫుడ్ ను పెట్టుకుంటే మంచి లాభాలను పొందవచ్చు..
గిఫ్ట్స్ మరియు బొమ్మల దుకాణం..
పండుగలలో బహుమతులు ఇవ్వడం ఒక ముఖ్యమైన భాగం.. ఈ సీజన్ లో ఈ వ్యాపారం మంచి లాభాలను తెచ్చిపెడుతుంది..పండుగలు బొమ్మల దుకాణాలు ఏర్పాటు చేయడానికి అనువైన సమయం.. రోజుకు వేలల్లో ఆదాయాన్ని పొందవచ్చు..
తాజావార్తలు
-
Ashok Selvan: ‘కింగ్ 100’లో నాగ్ని ఢీకొట్టేది ఇతనేనా?
-
Scam: నల్లగొండలో నకిలీ ఉద్యోగ స్కాం.. రిటైర్మెంట్ తర్వాత డెత్ డ్రామా..
-
Akkineni Nagarjuna: కొత్త హీరోలకు ఆ ఒక్కటే దిక్కు.. నాగార్జున కామెంట్స్ వైరల్!
-
Katrina – Vicky Kaushal: దీపావళి సర్ప్రైజ్.. కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా-విక్కీ! పిక్ చూశారా?
-
Seattle Diwali Celebrations: పండుగ వేళ విద్వేషం.. అమెరికాలో దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు యత్నం!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!