NTV Telugu Site icon

Bussiness Idea : మినరల్ వాటర్ ప్లాంట్ తో మంచి ఆదాయం..!

Plant

Plant

జనాలు సొంతంగా వ్యాపారాలు చేస్తూ డబ్బులను సంపాదించాలని కోరుకుంటున్నారు.. అయితే ఎలాంటి వ్యాపారాలు చేస్తే మంచి లాభాలు వస్తాయో తెలియక ఏదొక వ్యాపారం చేసి తీవ్రంగా నష్టపోతున్నారు.. అలాంటి వారికోసం అద్భుతమైన బిజినెస్ ఐడియా ను తీసుకొని వచ్చాము.. అదేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఈ బిజినెస్ ఐడియా తో మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. పైగా అదిరే లాభాలని పొందొచ్చు. ఇప్పుడు ఇక చలికాలం అయిపోతుంది. ఎండాకాలం కూడా మొదలు కాబోతోంది. కాబట్టి మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్లాన్ చేయాలనుకుంటుంటే మినరల్ వాటర్ బిజినెస్ ని ప్లాన్ చేసుకోవచ్చు.. మొదట ప్లాంట్ కోసం ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.. మీరు ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకోవడానికి 1000 నుండి 1500 చదరపు అడుగుల స్థలం తీసుకోవాలి. చాలా కంపెనీలు కమర్షియల్ ఆర్ఓ ప్లాంట్ ని తయారు చేస్తున్నాయి. 50 వేల రూపాయల నుండి 2 లక్షల వరకు దీని కోసం మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

అయితే 20 లీటర్ల సామర్థ్యం ఉన్న 100 వాటర్ క్యాన్లను కూడా కొనుగోలు చేయాలి. మినరల్ వాటర్ ప్లాంట్ కి మొత్తం ఐదు లక్షల దాకా అవుతుంది. మీరు లోన్ తీసుకోవచ్చు. ఒక మినరల్ వాటర్ బాటిల్ ధర 20 రూపాయలు. మీరు రోజుకి 400 వాటర్ క్యాన్స్ సప్లై చేస్తే 10,000 వస్తాయి. నెలకి మూడు లక్షల వరకు వస్తాయి. కరెంట్ బిల్ ఇటువంటి ఖర్చుల కింద లక్ష రూపాయలు పోగా 50,000 నికర లాభం వస్తుంది.. ఆదాయం రాను రాను పెరుగుతూ ఉంటుంది.. లాభాలే కానీ నష్టాలు లేవని నిపుణులు చెబుతున్నారు..