NTV Telugu Site icon

Bussiness Idea : రైతులకు కాసుల వర్షం కురిపిస్తున్న నల్లబియ్యం.. లక్షల్లో ఆదాయం..

Black Rice

Black Rice

బిజినెస్ చెయ్యాలని చాలా మంది అనుకుంటారు.. అయితే పెద్ద పెద్ద వ్యాపారాలు మాత్రమే కాదు వ్యవసాయం చేస్తూ కూడా మంచి ఆదాయాన్ని పొందుతూన్నారు.. ఎప్పుడూ పండించే పంటలు కాకుండా కొత్త పంటలు అంటే మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను పండిస్తే లాభాలను పొందవచ్చు.. అలాంటి పంటల్లో ఒకటి నల్ల బియ్యం.. ఈ బియ్యనికి మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. ఈ పంటను పండిస్తున్న రైతులు లక్షల్లో సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా ఉంటున్నారు.. ఈ బియ్యాన్ని ఎలా పండించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

నల్లబియ్యాన్ని పండిస్తే భారీగా లాభాలు వస్తాయి. నల్ల బియ్యం లో పోషక పదార్థాలు కూడా సమృద్ధిగా ఉంటాయి ఔషధ గుణాలు కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది తినేందుకు ఇష్టపడుతున్నారు. డయాబెటిస్ బీపీ సమస్యతో బాధపడే వాళ్లకైతే ఇంకా మంచి చేస్తుంది. షుగర్ బిపి వంటివి ఈ బియ్యం తినడం వలన కంట్రోల్లో ఉంటాయి. ధర ఎక్కువైనా సరే ఆరోగ్యానికి మంచిదని చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు.. మొదట చైనాలో మాత్రమే పండించే ఈ బియ్యాన్ని ఇప్పుడు అన్ని దేశాల్లో పండిస్తున్నారు..

ఈ బియ్యం చూడడానికి నల్లగా వున్నా వీటిని వండుకున్న తర్వాత అన్నం నీలం రంగులో లేదా ఉదా రంగు లోకి మారిపోతుంది. ఈ పంట కాలం దాదాపు నాలుగు నెలలు ఇది పండడానికి 100 నుండి 120 రోజులు సమయం పడుతుంది. మామూలు బియ్యం కిలో 50 నుండి 100 రూపాయలు ఉంటే ఈ బియ్యం మాత్రం 250 నుండి 500 వరకు ఉంటాయి.. దిగుబడి బాగా వస్తే ఒక్కసారికే లక్షాధికారి అవ్వచ్చు.. వ్యవసాయ నిపుణుల సలహా ప్రకారం పండిస్తే మరింత లాభాలను పొందవచ్చు..