Site icon NTV Telugu

BSNL Offer: బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్‌.. ఏడాది అన్‌లిమిటెడ్..

Bsnl

Bsnl

టెలికం రంగంలోని ప్రైవేట్‌ సంస్థల మధ్య తీవ్ర పోటీ నడుస్తోన్న సమయంలోనూ.. ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్ఎన్ఎల్) తానేమి తక్కువ అనే తరహాలో కొత్త ప్లాన్లను తీసుకొస్తూ ఔరా! అనిపిస్తోంది.. ప్రైవేట్‌ టెలికం సంస్థల కంటే తక్కువ ధరలకే సేవలు అందిస్తోంది.. తాజాగా, తమ యూజర్లకు బంపరాఫర్‌ తీసుకొచ్చింది బీఎస్‌ఎస్‌ఎన్‌ఎల్.. రూ.1999 ప్లాన్‌తో దీర్ఘ కాలిక ప్రయోజనాలను కలిపించే ఓ ప్లాన్‌ తీసుకొచ్చింది.. బీఎన్‌ఎన్‌ఎల్‌ రూ. రూ. 1999 ప్రీపెయిడ్ ప్లాన్‌ మొత్తం 365 రోజుల వ్యాలిడిటీ ఉండగా.. ఈ ప్లాన్ ఇప్పుడు కొన్ని సర్కిళ్లలోనే అందుబాటులో ఉంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ ద్వారా అపరిమిత వాయిస్ కాల్స్‌, రోజుకు 100 ఎంఎస్‌ఎస్‌లతో పాటు మొత్తం 600 జీబీ డేటాను పొందవచ్చు. సదరు వినియోగదారుడు ఆ 600 జీబీ డేటాను ఎప్పుడైనా ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది..

Read Also: MH Political Crisis LIVE :మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు..రెబల్స్ కు మద్దతుగా గవర్నర్..?

ప్రస్తుతం చాలా ప్రీపెయిడ్ ప్లాన్లలో రోజుకు 1.5 జీబీ, 2 జీబీ లేదా 3 జీబీ డేటా పరిమితులు ఉన్నాయి. కానీ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌తో 600 జీబీ వస్తుంది.. ఆ డేటాను ఎప్పుడు ఉపయోగించుకుంటారు అనేది వినియోగదారుడిపై ఆధారపడి ఉంటుంది. మొత్తాన్ని ఒకే రోజులో ఉపయోగించవచ్చు లేదా మొత్తం సంవత్సరానికి తదనుగుణంగా వాడుకునే వీలుంటుంది. వినియోగదారులు తమకు అవసరమైనప్పుడు మరియు ఒక నిర్దిష్ట రోజున పుష్కలంగా డేటాను ఉపయోగించుకునే పూర్తి స్వేచ్ఛను ఇస్తోంది బీఎన్‌ఎన్‌ఎల్.

Exit mobile version