Site icon NTV Telugu

BMW Cars: 10 లక్షల కార్లను రీకాల్ చేసిన బీఎండబ్ల్యూ

ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే లగ్జరీ కార్లలో బీఎండబ్ల్యూ కార్లు టాప్ ప్లేస్‌లో ఉంటాయి. జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ కార్లు విలాసవంతమైన వాహనాలుగా పేరుపొందాయి. అయితే తాజాగా బీఎండబ్ల్యూ కార్లలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడే ముప్పు ఉందని నిపుణులు గుర్తించారు. బీఎండబ్ల్యూ కార్లలోని పాజిటివ్ క్రాంక్ కేస్ వెంటిలేషన్ వాల్వ్ లోపభూయిష్టంగా ఉందని, ఇది షార్ట్ సర్క్యూట్‌కు దారితీసి కారులో అగ్నిప్రమాదానికి కారణమవుతుందని వారు తెలిపారు

ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలకు పైగా కార్లను ఈ జర్మనీ కార్ల తయారీ దిగ్గజం రీకాల్ చేస్తోంది. ఇంజిన్ వద్ద పొగ లేదా, పొగ వాసన వస్తుంటే మాత్రం తమ కార్లను వెంటనే డ్రైవింగ్ చేయడం నిలిపివేయాలని బీఎండబ్ల్యూ వాహన యజమానులకు స్పష్టం చేసింది. వెనక్కి పిలిస్తున్న కార్లలో ఒక్క అమెరికాలోనే 9.17 లక్షల కార్లు ఉన్నాయని తెలుస్తోంది. 2006-2013 మధ్యకాలంలో తయారైన కార్లను, ముఖ్యంగా 1 సిరీస్, 3 సిరీస్, ఎక్స్ 3, జడ్ 4, ఎక్స్ 5, 5 సిరీస్ కార్లను బీఎండబ్ల్యూ రీకాల్ చేసినట్లు సమాచారం.

https://ntvtelugu.com/petrol-prices-will-increase-minimum-15-rupees-per-liter/
Exit mobile version